సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన చాలా మంది నటీనటులు పెద్దయ్యాక కూడా సినిమాలలో నటించాలని భావిస్తారు. ఈ క్రమంలో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే కొందరికి అదృష్టం కలిసి రాగా, మరి కొందరికి అదృష్టం కలిసి రాలేదు. కమల్ హాసన్, తనీష్, తేజ సజ్జా, వైష్ణవ్ తేజ్, తరుణ్.. ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సూర్యవంశం’ చిత్రం లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ ఆ సినిమాలో తన నటనతో ఎంతగానో మెప్పించాడు. సూర్య వంశం అనే సినిమాలో జూనియర్ వెంకటేష్ కొడుకు గా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఆనంద్ వర్ధన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించారు.
సూర్య వంశం చిత్రంలో ఆనంద్ నటనకు గానూ ‘నంది అవార్డు’ అందుకోవడమే కాదు.. పలు హిట్ చిత్రాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సూర్యవంశం’, ‘మా విడాకులు’, ‘మనసంతా నువ్వే’, ‘బాల రామాయణం’, ‘ప్రియరాగాలు’, ‘ప్రేయసి రావే’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘ఇంద్ర’, ‘నేనున్నాను’ లాంటి చిత్రాల్లో కనిపించాడు ఆనంద్ వర్ధన్. 1996లో సినీ ఇండస్ట్రీకి బాల నటుడిగా అడుగుపెట్టిన ఇతడు.. సుమారు 14 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించి.. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ప్లేబ్యాక్ సింగర్ పిబి శ్రీనివాస్ మనవడైన ఆనంద్ వర్దన్.. 2004లో వచ్చిన ‘నేనున్నాను’ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు.
2012లో తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ఆనంద్.. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ చేస్తున్న సమయంలో తనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని తెలిపాడు. ఇక ఇలా ఫైర్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలు అయ్యాయి అంటూ చెప్పుకొచ్చాడు.అంతేకాదు ఇక రెండు నెలలపాటు ఐసీయూలో చికిత్స తీసుకున్నాను అంటూ ఆనంద్ వర్ధన్ తెలిపాడు.