మేఘాలలో తేలిపొమ్మన్నది,తూఫానుల రేగిపోమ్మన్నది…అని పాటలు పాడుకుంటూ ఆ సినిమాలో హీరో హీరోయిన్లలా ఫీల్ అయినవారెందరో 90లలో..అంతలా యూత్ ని ఆకట్టుకుంది గులాబి సినిమా.దర్శకుడు కృష్ణవంశీకి,హీరో జెడి చక్రవర్తికి మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ..,ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అంటూ ఈ సినిమాతోనే పరిచయం అయింది సునీత ..గులాభి సినిమా గుర్తొస్తే ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ మహేశ్వరి..తన అందం,అభినయం,హస్కీ వాయిస్,అల్లరి ..కళ్లు..అనేక అంశాలతో ఆకట్టుకున్న మహేశ్వరి అప్పట్లో కుర్రాళ్ల మతి పోగొట్టింది.
మన అతిలోక సుందరి శ్రీదేవికి చెల్లెలవుతుంది మహేశ్వరి.గులాభి సినిమా ద్వారా పరిచయం అయిన మహేశ్వరికి ఆ సినిమా తర్వాత అంతటి హిట్స్ రాలేదు.రవితేజతో నటించిన నీకోసం సినిమా లో నటనకుగానూ నంది అవార్డు అందుకుంది.కొన్ని సినిమాలలో నటించినప్పటికి గుర్తింపు రాకపోవడంతో ఇక వెండతెరకు గుడ్ బై చెప్పేసి,బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.మై నేమ్ ఈజ్ మంగతాయారు అంటూ వచ్చిన సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. గులాభికి తర్వాత జెడితో కలిసి రెండు మూడు సినిమాల్లో నటించింది.దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలొచ్చాయి.జెడి మహేశ్వరిని పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాడని ,కానీ అదెందుకు బెడిసికొట్టిందో తెలియదు మహేశ్వరి జై క్రిష్ణన్ ని పెళ్లి చేసుకుంది.జెడి మరోక నటిని పెళ్లి చేసుకున్నారు..
పెళ్లి తర్వాత ఆడవాళ్లల్లో మార్పు రావడం సహజం.కానీ కొందరిలో మాత్రం అప్పటి పోలికలు లేకుండా వీళ్లేనా వాళ్లు అన్నట్టుగా తయారవుతారు.మహేశ్వరి కూడా పెళ్లి తర్వాత అప్పటి పోలికలు లేకుండా తయారయింది. మహేశ్వరి చేత శ్రీదేవి గతంలో హైదరాబాద్ లో ఒక బొటిక్ ఓపెన్ చేయించింది,మహేశ్వరి ఫ్యాషన్ కలెక్షన్స్ పేరిట ఒక స్టోర్ ని నిర్వహించింది.