Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పోన్‌మ్యాన్ సినిమా చూశారా?

Admin by Admin
May 30, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేల మీద నిలబడని స్పైడర్ మ్యాన్‌లు, పైకి ఎగిరిపోయే హీమ్యాన్‌లు, పై నుంచి దూకేసే సూపర్ మ్యాన్‌లు చూశాం. పోన్‌మ్యాన్‌ని చూశారా? చూడకపోతే వెంటనే చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఈ పోన్‌మ్యాన్‌కి ఎగరడాలు, దూకడాలు అస్సలు రావు. వార్నింగ్‌లు, ఫైటింగ్‌లు చేతకావు. కేవలం మనలో ఒకడు. మనలాంటి వాడు మాత్రమే. అయినా సరే.. వాళ్ల కంటే అద్భుతంగా కనిపిస్తాడు.ఈ సినిమాకి పోన్‌మ్యాన్ అని పేరు పెట్టిన డైరెక్టర్ ఆలోచనకి నేనైతే ఆల్ మోస్ట్ ఫిదా అయిపోయాను.అందులో ఆయన తెలివి, చమత్కారం, మంచి ఇంటెన్షన్ కనిపించాయి. మామూలుగా చూస్తే పోన్‌మ్యాన్ ఇదొక డార్క్ కామెడీ సినిమాగా మాత్రమే అనిపిస్తుంది. నవ్వు తెప్పించే కామెడీయే కాదు.. కంటతడి పెట్టించే విషయాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా మొత్తం బంగారం చుట్టూ తిరుగుతుందనిపిస్తుంది. కానీ కాదు బంగారం లాంటి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. నిప్పులో కాల్చినా, నీటిలో ముంచినా, మట్టిలో పూడ్చినా కూడా బంగారం విలువ ఏ మాత్రం తగ్గదు. అలాంటి ధృఢమైన క్యారెక్టరే పోన్‌మ్యాన్ సినిమా. పోన్ అంటే బంగారం, మ్యాన్ అంటే వ్యక్తి. ఈ సినిమా పేరు అర్థం ఇది.

ఇందులో మెయిన్ లీడ్‌గా బాసిల్ జోసెఫ్ నటించాడు. బాసిల్ జోసెఫ్ తన నటనతో ఎంతగా మెప్పించాడంటే తను ఇచ్చే ప్రతి ఎక్స్‌ప్రెషన్, రియాక్షన్, డైలాగ్ మనల్ని కట్టిపడేస్తుంది. తనతోపాటు మనల్ని నడిపిస్తాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు, ఏడిపిస్తాడు. బహుశా ఈ క్యారెక్టర్‌ని బాసిల్ తప్ప ఇంకెవరూ ఇంత రియలస్టిక్‌గా చేయలేరేమోనని అనిపించేలా ఆ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. ఈ సినిమా కథ చెప్పాలంటే పీపీ అజేశ్ (బాసిల్ జోసెఫ్) గోల్డ్ జ్యుయలరీ సేల్స్ ఏజెంట్. అంటే బంగారం సేల్ చేసే వ్యక్తి కాదు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు కుటుంబానికి బంగారాన్ని సమకూర్చి, వాటి డబ్బును చదివిపుల రూపంలో వచ్చిన వాటితో జమ చేసుకుంటాడు. దీనికోసం ముందుగానే అగ్రిమెంట్ కూడా చేసుకుంటాడు. అలా ఓ పెళ్లికూతురు కోసం 25 సవర్ల బంగారం ఇప్పిస్తాడు. తీరా పెళ్లిలో చదివింపులు కనీసం బంగారం విలువలో సగం కూడా రావు. దీంతో వచ్చిన చదివింపుల మేర బంగారం ఉంచుకుని, మిగతా బంగరం ఇచ్చేయమని కుటుంబాన్ని కోరతాడు. కానీ ఆ పెళ్లి కూతురు స్టెఫీ మొత్తం బంగారంతో అత్తారింటికి వెళ్లిపోతుంది. అజేశ్ మాత్రం తన నగలు కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తాడు.

have you seen ponman movie how is it

మన హీరోలైతే.. ఒక ఫైటింగ్, వార్నింగ్‌తోనో ఫట్‌ ఫట్ మని ఆ బంగారాన్ని వెనక్కి తీసేసుకుంటారు. కానీ అజేశ్ ఒక సామాన్యమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అంత బంగారాన్ని వెనక్కి ఎలా తీసుకున్నాడన్నదే కథ. ఈ చిన్న లైన్‌తో డైరక్టర్ .. రెండున్నర గంటల సినిమాగా తీయడమే కాకుండా.. అందరూ కళ్లగప్పించి చూసేలా చేయగలిగాడు. అంతేకాదు అజేశ్ (బాసిల్) క్యారెక్టర్‌తో చాలా పెద్ద విషయాలను కూడా మనకు చెప్పాడు. మామూలు మధ్య తరగతి మనుషులతో అవసరం, ఆకలి, ఆత్మవిశ్వాసం, నిజాయితీ దోబుచూలాడుతుంటాయి. అవసరాలు, ఆకలి ముందు చాలాసార్లు ఆత్మవిశ్వాసం, నిజాయితీ ఓడిపోతుంటాయి. కొన్ని విపత్కర సమయాల్లో నిజాయితీని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండగలగడం అంత సులభమైన విషయం కాదు. దానికి చాలా ధృఢంగా ఉండాలి. పట్టుదలగా, ఓర్పుగా ఉండాలి. ఈ విషయమే పోన్‌మ్యాన్ సినిమా చెప్పింది. అందుకే సూపర్‌మ్యాన్ కంటే.. పోన్‌మ్యాన్.. మన మనస్సులను గెలుచుకుంటాడు.

ఈ సినిమాలో అజేష్ ముందు తనను పార్టీలోంచి తీసేశారనే బాధతో ఓ వ్యక్తి ఉరివేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో కొన్ని డైలాగ్స్ కచ్చితంగా అందరికి తాకుతాయి. పార్టీలోంచి తీసేస్తే.. వెళ్లేందుకు కూడా వేరే దారి ఉంటుంది. పార్టీలోంచి తీసేశారని ఉరికి వేలాడితే మళ్లీ తీసుకుంటారా? .. నీకంటూ టైమ్ వస్తుంది వెయిట్ చేయాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకునేవాళ్లే నష్టపోతున్నారు. కష్టపడి పోరాడి బతికి చూడు అప్పుడు తెలుస్తుంది. మన బాబో, తాతో మనకోసం 10 పైసలు కూడా సంపాదించి పెట్టలేదు. అందుకే దొరికిన సమయంలో మనం సంతోష పడాలి, లేని సమయంలో మనం కష్టపడాలి అదే లైఫ్. నేనేమి గొప్పోడిని కాదు.. కానీ అవకాశం దొరికితే గెలిచి చూపిస్తాను. పోరాటమనేది వస్తే నించుని పోరాడతాను. ఇవే కాదు.. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ కూడా చాలా సాధారణంగా అనిపించినా.. ఆలోచన కలిగించేలా చేస్తాయి. జీయో హాట్‌స్టార్‌లో ఉంది.. చూడకపోతే వెంటనే చూసేయండి.

Tags: pon man
Previous Post

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Next Post

కుటుంబ పెద్దకు ఈ లక్షణాలు లేకపోతే కుటుంబం చెల్లాచెదురుగా ఉంటుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

మీ పిల్ల‌లు నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

July 21, 2025
హెల్త్ టిప్స్

డిప్రెష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది..!

July 21, 2025
పోష‌ణ‌

వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

July 21, 2025
vastu

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు తిరుగుతాయి జాగ్ర‌త్త‌..!

July 21, 2025
lifestyle

గురువారం నాడు త‌ల‌స్నానం అస‌లు చేయ‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే..?

July 21, 2025
lifestyle

రాత్రి ప‌డుకునే ముందు దిండు కింద వీటిని పెట్టుకోండి.. పీడ‌క‌ల‌లు రావు..

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.