టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ తో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సత్యదేవ్. ఓవైపు హీరోగా సినిమాల్లో మెప్పిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు సాధించారు. ఆ తర్వాత గుర్తుందా శీతాకాలం మూవీలో హీరోగా అలరించారు.
అలాంటి సత్య దేవ్ సినిమాల్లోకి రాకముందే వివాహమైంది.. మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఆయనకు పెళ్లయింది అనే విషయం చాలా మందికి తెలియదు. గుర్తుందా శీతాకాలం మూవీ ప్రమోషన్స్ ఈవెంట్లో తన భార్యను పరిచయం చేశారు సత్యదేవ్. అయితే గతంలో తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యామిలీతో దిగిన ఒక ఫోటోను షేర్ చేశాడు.
సత్యదేవ్ భార్య పేరు దీపికా కొడుకు పేరు సవర్నిక్.. ఫిబ్రవరి 8వ తేదీన కొడుకు బర్త్ డే సందర్భంగా భార్య కొడుకుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సువర్ణీత్ మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు.. నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. తన కొడుకుకు స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపారు సత్యదేవ్. ఆ ఫోటోలు చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. రకరకాల కామెంట్లతో ప్రశంసల జల్లు కురిపించారు.