Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

నాటు నాటు పాట కోసం ఎన్ని నెలలు కష్టపడ్డారో తెలుసా..? ఈ పాట ఎలా పుట్టిందంటే..?

Admin by Admin
April 23, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీని తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాట సూపర్ హైలైట్ అయింది. ఇక ఆస్కార్ తర్వాత ఉన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ విభాగంలో సొంతం చేసుకుంది. దీంతో నాటు నాటు పాట మరింత పాపులర్ అయింది. ఆసియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి పాట ఇదే కావడం విశేషం. ఈ పాటకి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డును అంతర్జాతీయ వేదికపై అందుకున్నారు. అయితే ఈ పాట కోసం చిత్ర యూనిట్ ఎంతగానో కష్టపడిందట.

ఈ పాటని ఎలా మొదలు పెట్టాలో అని ఆలోచించినప్పుడు కీరవాణి కి మొదట గుర్తొచ్చిన పేరు చంద్రబోస్. కీరవాణి స్వరపరిచిన ఎన్నో పాటలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అయితే రామ్ చరణ్, తారక్ ఇద్దరు బెస్ట్ డాన్సర్ల కోసం మాస్ సాంగ్ కు చంద్రబోస్ అయితేనే న్యాయం చేస్తాడని కీరవాణి ఆయనని పిలిపించారట. 1920 ప్రాంతంలోని కథకి తగిన మాటలు వాడాలి కాబట్టి చంద్రబోస్ రెండు రోజుల్లో మూడు పల్లవులను రాసుకొని కీరవాణి ముందు ఉంచాడట. పొలం గట్టుతో సాగే పల్లవిని రాజమౌళి కీరవాణి లు ఓకే చేశారు. అందులో నా పాట చూడు అనే పదానికి ముందు చంద్రబోస్ నా పాట పాడు అనే పదాన్ని రాశాడట. దానిని కీరవాణి నా పాట చూడు గా మార్చారు. ఈ పాట 90% పూర్తయిపోయినప్పటికీ, ట్యూన్ కూడా సిద్ధమైనప్పటికీ మార్పులు చేర్పులు చేస్తూ ఈ పాటని పూర్తి చేయడానికి 19 నెలల సమయం పట్టిందట. ఆ తర్వాత ఈ పాత్రను చిత్రీకరించడానికి మూవీ యూనిట్ ఉక్రెయిన్ వెళ్ళింది.

how film makers worked hard for natu natu song making

అక్కడ ఈ పాత్రను చిత్రీకరిస్తున్న సమయంలో రాజమౌళికి ఏదో అసంతృప్తిగా అనిపించి వెంటనే చంద్రబోస్ కి కాల్ చేసి మరికొన్ని మార్పులు చేయవలసిందిగా కోరాడట. దాంతో 15 నిమిషాలలోనే చంద్రబోస్ మరో రెండు లైన్లను మార్చి అందించినట్టుగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు చంద్రబోస్. ఇక ఈ పాట కోసం ప్రేమ్ రక్షిత్ ఏకంగా 95 స్టెప్పులను కంపోజ్ చేశాడు. రామ్ చరణ్ – తారక్ ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకొని చేసిన హూక్ స్టెప్పు కోసం ఏకంగా 30 స్టెప్పులు రెడీ చేశాడు. ఇలా ఈ పాట కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం చిన్నపాటి యుద్ధమే చేసింది. అలా ఈ పాటలోని పదాలను మారుస్తూ రాసి, రాహుల్ సిప్లిగంజ్ తో పాడించి, పాటను కంపోజ్ చేసి, చిత్రీకరించే వరకు దాదాపు 20 నెలల సమయం పట్టిందట. చిత్ర బృందం అంత కష్టపడింది కనుకే ఈ పాటకు గ్లోబల్ గా ప్రశంసలు దక్కాయి.

Tags: natu natu song
Previous Post

ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో ఫ్రీ వైఫై వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే…!

Next Post

సినిమాల్లో సైడ్ విలన్ గా చేసే బాడీ బిల్డర్ షేక్ శ్రీను బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే..!!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!