వినోదం

ప్రియదర్శి నటించిన కోర్ట్ మూవీ ఎలా ఉంది?

ఈ కోర్ట్ మూవీ రిలీజ్ అయ్యే టైంలో సరైన సినిమాలేవి లేవు. ఇంటర్మీడియట్ మరియు పది పరీక్షల సీజన్ కావడంతో పెద్ద సినిమాలేవి రిలీజ్ కి రాలేదు. ఇలాంటి టైం లో ఈ సినిమా రిలీజ్ అవటంతో ఎలా ఉందో చూద్దామని థియేటర్ కి వెళ్ళాను. మరి కోర్ట్ మూవీ బాగుందా అంటే.. నాకైతే నచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్ రేసీ స్క్రీన్ ప్లే తో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. చివరి 45 నిమిషాలు సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి.

కథ గురించి నేనైతే చెప్పను గానీ చట్టాన్ని ఎలా మిస్ యూజ్ చేస్తున్నారో చాలా క్లియర్ గా చూపించారు ఈ సినిమాలో. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి రెండు మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి శివాజీ. రెండు లాయర్ రోల్ చేసిన ప్రియదర్శి. ఇద్దరూ కూడా తమ నటనతో ఇచ్చి పడేశారు. మరీ ముఖ్యంగా శివాజీ నటన అందరిని బాగా ఆకట్టుకుంటుంది. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే శివాజీని చూసి భయమేసింది కూడా. సినిమాలో పేరుకి ఆయనది నెగిటివ్ రోల్ అనే కానీ చాలా మంది ఆడియన్స్ ఆయనని విపరీతంగా అభిమానిస్తారు. అంతగా నచ్చింది ఆయన నటన.

how is court movie

సగటు ఆడపిల్ల తండ్రిగా ఆయన చెప్పే విషయాలు నిజమే అని ఒప్పుకోక తప్పదు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎంత అభద్రతాభావంతో ఉంటారో ఆయన క్యారెక్టర్ ని చూస్తే తెలుస్తుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారని చెప్పాలి. కోర్టు మూవీ త‌ప్ప‌క చూడాల్సిన సినిమా.

Admin

Recent Posts