వినోదం

ఊరి పేర్ల‌తో వ‌చ్చిన సినిమాల‌లో ఎన్ని హిట్స్ అయ్యాయో మీకు తెలుసా..?

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ప‌రంగా కొంద‌రు త‌మ సినిమాల‌కి ఊరి పేర్ల‌ని కూడా పెట్టుకుంటారు. అయితే ఊరి పేర్ల‌తో వ‌చ్చిన సినిమాలు కొన్ని మంచి విజ‌యం సాధించ‌గా, మ‌రి కొన్ని అప‌జయం మూట‌గ‌ట్టుకున్నాయి. అయితే తెలుగులో ఊరి పేర్ల‌తో ఎన్ని సినిమాలు వ‌చ్చాయి. వాటిలో ఎన్ని విజ‌యం సాధించాయి, ఎన్ని అప‌జ‌యం పొందాయి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మణిరత్నం దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా బొంబాయి. ఈ సినిమాకి ఊరి పేరు పెట్టారు ఇక రజినీకాంత్ హీరోగా నటించిన అరుణాల‌చలం మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.

కమల్ హాసన్ నటించిన సినిమాకి తెనాలి అనే ఊరి పేరు పెట్టారు. అయితే తెలుగులో ఈ మూవీ అంత‌గా ఆడలేదు. సూపర్ స్టార్ కృష్ణ, వడ్డే నవీన్ నటించిన చిత్రం అయోధ్య‌. ఈ మూవీకి ఆశించిన విజయం పొందలేదు. అయోధ్య శ్రీ రాముడి జన్మస్థలం పేరు. ఎన్.శంకర్ డైరెక్షన్లో శ్రీహరి హీరోగా వచ్చిన చిత్రం భ‌ద్రాచలం. ఈ మూవీ హిట్ అందుకుంది. శ్రీహరి హీరోగా న‌టించిన చిత్రం శ్రీశైలం. ఇది యావరేజ్ గా నిలిచింది. అనంత‌పురం అనే ఊరి పేరుతో వ‌చ్చిన తమిళ సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఈ మూవీ నిరాశ పరిచింది. హనుమాన్ జంక్షన్ .. ఈ పేరుతో వ‌చ్చిన సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఇందులో అర్జున్, జగపతి బాబు, వేణు నటించారు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అన్న‌వ‌రం సినిమా విజయం పొందలేదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ‌ద్రీనాత్ అనే సినిమా పెద్దగా ఆడలేదు.

how many movies were hit those came with city names

ఇక 2018 లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య హీరోగా వచ్చిన బెజ‌వాడ సినిమా విజయం పొందలేదు. నాని హీరోగా వచ్చిన భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు సినిమా విజయం పొందలేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ద్వార‌క సినిమా ప్లాప్ అయ్యింది. కులుమనాలి అనే సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇందులో శశాంక్, విమల రామన్ నటించారు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. శ్రీహరి హీరోగా వచ్చిన సింహాచలం సినిమా యావేరేజ్ గా నిలిచింది. రేణిగుంట‌ ఊరు పేరుతో వచ్చిన సినిమా విజయం పొందలేదు. జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన కాశీ కూడా నిరాశ‌ప‌ర‌చింది. అజిత్ హీరోగా వచ్చిన డబ్బింగ్ సినిమాకి పుణ్యక్షేత్రమైన తిరుపతి పేరు పెట్టిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

Admin

Recent Posts