లేదు. స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి గురించి ఈ పాత్ర సృష్టించారు అని అప్పట్లో చెప్పుకున్నారు. ఢీ సినిమా అప్పుడు దర్శకుడు శ్రీను వైట్లకి చక్రికి మధ్య జరిగిన కొన్ని విభేదాల వల్ల ఈ పాత్రని సృష్టించారు అని చెప్తారు. అయితే ఆ ప్రచారాన్ని తర్వాత కాలం లో వైట్ల ఖండించారు. చక్రి తనకు తమ్ముడు వంటి వాడని ఆ వివాదానికి ముగింపు పలికారు వైట్ల.
అదే కాకుండా బ్రహ్మానందం పాత్ర సరిగమపలో జడ్జి కనుక, ఎక్కువగా ఆ పాత్ర మరొక సంగీత దర్శకుడు కోటిని పేరడీ చేయడానికి తీశారని చెప్పుకున్నారు.
ఇక వైట్లకి ఇలాంటి పేరడీ లు తీయడం ఒక సరదా అని చెప్పుకోవచ్చు. దుబాయ్ శ్రీను సినిమాలో స్వర్గీయ నటుడు సూపర్ స్టార్ కృష్ణని పేరడీ చేస్తూ ఫైర్ స్టార్ సాల్మొన్ రాజు పాత్ర ఎం ఎస్ నారాయణతో చేయించారు. ఆ పాత్ర ని చూసి కృష్ణ చక్కగా నవ్వుకున్నారని చెప్పారు. నిజంగా భోళా మనిషే కదా ! అలాంటివాళ్ళు ఈరోజుల్లో ఉంటారా అసలు!