Viral Photo : టాలీవుడ్‌లో ఎంతో మంది అందాల ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో కొందరు తమ అందంతో అదరగొడుతుంటే మరి కొందరు టాలెంట్‌తో దుమ్ము రేపుతున్నారు. వారిలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో గొప్ప పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇక మహానటి సినిమాతో మహానటి అని దేశవ్యాప్తంగా అనిపించుకుంది. ఈ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది.
చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో వచ్చిన ‘గీతాంజలి’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘నేను శైలజ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె నటనతో తగిన గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఆమె తండ్రి నిర్మాత సురేష్ కుమార్ మరియు తల్లి ఒకప్పటి హీరోయిన్ మేనక..
కీర్తి సురేష్ నటించిన మహేష్ బాబు సర్కారు వారి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ అమ్మడు చిన్నప్పుడు నటించిన ఒక సినిమా క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో కీర్తి సురేష్‌ని ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. ఈమె మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో చెల్లెలి పాత్రలో కనిపించింది. నాని హీరోగా చేసిన దసరా సినిమాలో కూడా హీరోయిన్ గా కీర్తినే నటించింది.