Lakshmi Pranathi : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే.. 2011 మే 5న వివాహబంధంతో భార్యభర్తలు అయ్యారు. ప్రణతి ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనకోడలు కుమార్తె. ఇటు ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నె శ్రీనివాసరావుకు కుమార్తె. ఇక ఎన్టీఆర్ – ప్రణతి దంపతులకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్ – భరత్ రామ్ ఉన్నారు. ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి పెళ్లి వెనకాల చాలా స్టోరీయే ఉంది. ఎన్టీఆర్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబ సభ్యులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.
ముఖ్యంగా తన భార్య పిల్లల విషయంలో మాత్రం స్పెషల్ కేర్ తీసుకుంటాడు ఎన్టీఆర్ .చాలాసార్లు తన భార్య ప్రణతి గురించి, పిల్లల గురించి అభిమానులతో పంచుకున్నాడు.ఇక ఎన్టీఆర్ కు ప్రణతి పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టిందట. కొన్ని సంవత్సరాల కిందట.ఎన్టీఆర్ తో లక్ష్మీ ప్రణతి ఎంగేజ్మెంట్ జరిగాకా లక్ష్మీ ప్రణతి పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టిందట. పెళ్లి తర్వాత ఎన్టీఆర్ ను తన కోసం కనీసం రెండు నెలల సమయాన్ని కేటాయించాలని కోరడంతో పాటు ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లడం తగ్గించాలని డిమాండ్ చేసిందట.
అంతేకాదు తను తీసుకునే ఫుడ్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటానని తెలిపిందట. సినిమా షూటింగ్ ల కోసం అవుట్ డోర్ కు వెళ్ళినప్పుడు కూడా తన డ్రెస్ విషయంలో కేర్ తీసుకుంటానని కూడా ప్రణతి తెలిపిందట.అలా ఎన్టీఆర్ కు పెళ్లికి ముందే కండిషన్స్ పెట్టి మంచి భార్యగా పేరు తెచ్చుకుంది ప్రణతి. మొత్తానికి ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.