Indira Devi : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె మరణంతో మహేష్ బాబు చాలా కుంగిపోయారు. తల్లి అంటే మహేష్‌కి చాలా ప్రాణం. తల్లికి సంబంధించిన ఏ విషయం అయిన అభిమానులో పంచుకునే వారు మహేష్. ఆమె మరణం తర్వాత కొన్నాళ్ల పాటు మహేష్ చాలా కుంగిపోయారు. అయితే ఇందిరా దేవిని మొదట వివాహం చేసుకున్నారు కృష్ణ. నటన మీద ఉన్న మక్కువతో కృష్ణ డిగ్రీ పూర్తైన వెంటనే మద్రాసు వెళ్లారు. అక్కడ అవకాశాల కోసం వేచి చూస్తోన్న సమయంలోనే.. అంటే 1965లో ‘తేనే మనసులు’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఇక, ఆ సంవత్సరమే నవంబర్‌లో కృష్ణ.. ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
సూపర్ స్టార్ కృష్ణతో ఇందిరా దేవికి వివాహం జరిగిన తర్వాత వీళ్ల వైవాహిక జీవితం కొన్నాళ్లపాటు సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే ఈ జంటకు రమేష్ బాబు, పద్మావతి జన్మించారు. ఆ సమయంలోనే కృష్ణ, తోటి నటి విజయ నిర్మలతో చాలా కాలం పాటు సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలా 1969లో ఆమెను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఈ విషయాన్ని నేరుగా తన భార్య ఇందిరా దేవికి చెప్పగా, మొదట్లో ఈ విషయం విని ఆమె చాలా బాధపడిందట. ఆ తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తేల్చి చెప్పేశారని తెలిసింది.
ఇక, రెండో పెళ్లి అయినా భర్తతోనే కలిసి ఉంటానని సూటిగా చెప్పారంట. దీంతో కృష్ణ ఇద్దరు భార్యలతోనూ కలిసి ఉండేవారు. విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇందిరా దేవితో ఎక్కువగా కలిసి ఉండేవారు కృష్ణ. ఈ క్రమంలోనే ఈ జంటకు మంజుల, మహేశ్ బాబు, ప్రియదర్శినిలు జన్మించారు. పిల్లలు జన్మించాక ఇందిరా తన పిల్లలతోనే కలిసి ఉండేవారు. కానీ, కృష్ణ మాత్రం విజయ నిర్మలతోనే ఎక్కువగా ఉండేవారని టాక్ ఉంది. బ్రతికినంత కాలం ఇందిరాదేవి చాలా నిస్వార్ధంగా కుటుంబం కోసం జీవించారు. 70 ఏళ్ల ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసారు.