ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఫ్లాపులు. మిథున్ చక్రవర్తి… ఈ పేరు గురించి ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు కానీ.. ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించిన హీరోల్లో ఆయన కూడా ఒకరు. అసలు మిథున్ చక్రవర్తి సినిమా రిలీజవుతుందంటే… ఒకప్పుడు పండగే. అంతేకాదు ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఫ్లాపులు. అసలు బాలీవుడ్ మాత్రమే కాదు.. ఏ ఇండస్ట్రీ హీరో కూడా అంత ఫ్లాపులు ఫేస్ చేయలేదు.
కాగా మిథున్ చక్రవర్తి తన కెరీర్‌లో ఏకంగా 180 ఫ్లాపు సినిమాలు ఇచ్చాడు. ఆయన ఇప్పటివరకు నటించింది 350 సినిమాలైతే.. అందులో ఏకంగా 180 ఫ్లాపులే. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ 350 సినిమాల్లో, మిథున్ ఇప్పటివరకు ఆయన నటించిన 200 సినిమాలు చూడలేదట. అయినా కానీ.. మిథున్ చక్రవర్తిని స్టార్ హీరోగా చెప్పుకుంటుంటారు. దానికి కారణం కూడా ఉంది. అదేంటంటే అవే 50 హిట్టు సినిమాలు. అదేంటి 180 ఫ్లాపు సినిమాల ముందు 50 హిట్టు సినిమాలు ఓ లెక్కనా అనుకుంటున్నారా..? లెక్కే ఎందుకంటే.. ఆ 50 సినిమాలు మాములు హిట్లు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర అప్పట్లో కోట్ల కలెక్షన్లు వచ్చేవి. అప్పటికే అమితాబ్, ధర్మేంద్ర, వంటి స్టార్ హీరోలు బాలీవుడ్‌ను ఏలుతున్నా… వాళ్లను దాటి మరీ ఇండస్ట్రీ హిట్లు కొట్టేవాడు.
ఇక ఆయన ఆస్తి ఏకంగా రూ.400 కోట్లు. ఇక తెలుగులోనూ మిథున్ చక్రవర్తి పలు సినిమాల్లో నటించాడు. అందులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన గోపాల గోపాల సినిమా. ఈ సినిమాలో బాబాగా మేయిన్ రోల్ పోషించాడు. కాగా మిథున్ 1976లో మృగయ అనే ఆర్ట్ హౌస్ డ్రామాతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. 1982లో వచ్చిన డిస్కో డాన్సర్ సినిమా ఓ రేంజ్‌లో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అగ్నీపథ్, తక్‌దీర్, బాత్ బాన్ జాయే, గుణహోన్ కా దేవతా, శత్రంజ్, సౌతేలా, బిల్లా నో వంటి హిట్టు సినిమాలు ఆయనకు తిరుగులేని స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. మిథున్ చివరిగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో నటించాడు. ఇక మిథున్ 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాడు.