టాలీవుడ్ యంగ్ యాక్టర్ నాగ చైతన్య ఈ మధ్యనే తండేల్ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ డీసెంట్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద జోరును కొనసాగిస్తోంది. అయితే నాగచైతన్య తన కెరీర్‌లో చేసిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవగా.. ఆయన కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు. అవి సూపర్ హిట్ అవడం విశేషం. ఆయన వాటిని గానీ చేసి ఉంటే చైతూ కెరీర్ ఇంకోలా ఉండేదని అంటున్నారు. మరి చైతూ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. కొత్త బంగారు లోకం – వరుణ్ సందేశ్ హీరోగా చేసిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అయితే.. ఈ సినిమా ఆఫర్ చైతూకు వస్తే.. దాన్ని రిజెక్ట్ చేశారట. దీంతో వరుణ్ సందేశ్ ఆ మూవీని చేశారు.
భలే భలే మగాడివోయ్ – ఈ సినిమాలో హీరోగా నాని నటించి.. బంపర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే.. ఈ సినిమా స్టోరీని మొదట.. నాగ చైతన్యకు చెబితే కాదని చెప్పారట. సమ్మోహనం – సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం సినిమా మంచి విజయం సాధించింది. క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు మొదట చైతూను అనుకున్నారు. కానీ ఈ సినిమాను కూడా చైతూ వదులుకున్నాడు. రిపబ్లిక్ – సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను చైతూ వదులుకున్నాడు.
అఆ – త్రి విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. తెరకెక్కిన అఆ సినిమా కూడా మొదట నాగ చైతన్య వద్దకే.. వచ్చింది. కానీ నాగ చైతన్య ఈ మూవీని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ బిగ్గెస్ట్ హిట్ మూవీ.. నితిన్ దరికి చేరింది.