వినోదం

నాగ‌బాబు ఆస్తులు భారీగానే కూడ‌బెట్టాడుగా.. ఎంతో తెలిస్తే అవాక్క‌వుతారు..!

మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా నాగ‌బాబు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి న‌టుడిగా, నిర్మాత‌గా, జ‌డ్జిగా రాణిస్తున్నారు. తన సొంత బ్యానర్ మీద ఆరెంజ్ సినిమాని నిర్మించి భారీ నష్టాలను మిగిల్చుకున్న నాగబాబు ప్ర‌స్తుతం నిర్మాణానికి దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. అడ‌పాద‌డపా సినిమాలలో న‌టిస్తున్నాడు. ఇక తన కొడుకు వరుణ్ తేజ్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక తన కొడుకు నటించబోయే ఒక సినిమా తో నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నాగబాబు ఆస్తులకి సంబంధించిన వార్తలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు.ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. లక్ కలిసి రాలేదు. నిర్మాత‌గాను స‌క్సెస్ కాలేదు.జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు పాపులారిటీ పెరిగింది. అదే సమయంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో నాగబాబు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. జబర్ధస్త్‌ షోను వీడినా.. పలు టీవీ షోల్లో యాంకర్‌గా తనదైన ముద్ర వేశారు .ఎన్నికల సందర్భంగా నాగబాబు తన ఆస్తుల చిట్టాను బయట పెట్టడంతో ఎంత సంపాదించారన్న విషయం బయటపడింది.

nagababu net worth and properties value

నాగేంద్రబాబు ఆస్తులు మొత్తం రూ.41 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో వాహనాలు, చరాస్తులు 36.73 కోట్లు కాగా.. స్థిరాస్తులు 4.22 కోట్లు ఉన్నట్లు ఆయ‌న తెలియ‌జేశారు. ఇక ఇందులో ఆయ‌న‌కు 2.70 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు. అంటే నాగబాబు ఆస్తులు నికరంగా రూ.38 కోట్లు.. కానీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చూస్తే రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు రోజుకు ఒక్కో చిత్రానికి రూ.4.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. నాగబాబు హీరోగా కంటే పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు గానే మంచి విజయాన్ని అందుకున్నారు. మెగా హీరోలపై ఎవరైనా విమర్శలు చేస్తే వారికి కౌంటర్ ఇచ్చే విషయంలో నాగబాబు ముందువరసలో ఉంటారు. ఆరు పదుల వయస్సులో కూడా నాగబాబు ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

Admin

Recent Posts