సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ బాబుల కాంబినేషన్‌లో వచ్చిన పెదరాయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ముందు మోహన్ బాబు ఫ్లాప్‌లతో సతమతం అయ్యారు. కానీ ఎలాగైనా ఈ మూవీని తీయాలని అనుకున్నారు. ఇందుకు మోహన్ బాబు స్వయంగా నిర్మాతగా మారారు. ఈ సినిమాతో ఫ్లాప్‌లకు బ్రేక్ పడుతుందని చెప్పారు. రజనీకాంత్ సలహాతో నాట్టమై నిర్మాతతో మోహన్‌బాబు మీటయ్యారు. రజనీతో జరిగిన సంభాషణను వివరించి ఈ సినిమా రీమేక్ రైట్స్ కావాలని చెప్పారు. అందుకు తను అంగీకరించారు.
ఈ సినిమాకు తొలుత బి గోపాల్‌ను దర్శకుడిగా చేయాలన్నారు.రీమేక్ సినిమా కావడంతో తను అంగీకరించలేదు. చివరకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.పెద రాయుడు పేరుతో ఈ సినిమా నిర్మాణం మొదలైంది. మోహన్‌బాబు ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ కుదువపెట్టారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగింది.ఈ మూవీలో మోహన్‌బాబు తండ్రి క్యారెక్టర్ చేసిన రజనీ కాంత్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ రీమేక్ చిత్రం.
ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నదుకు సూపర్ స్టార్ ని అనే భేషజం ఏమాత్రం లేని రజనీ కాంత్ తన స్నేహితుడి కాళ్ళు పట్టుకుని తన కృతజ్ఞతలు తెలిపారు. హిట్లు లేక అప్పుల్లో మునిగిన మోహన్ బాబుకు ఈ చిత్రం ఊహించని అద్భుత విజయాన్ని అందించింది. ఈ సినిమా ఆడినన్ని రోజులు సినిమా థియేటర్లన్నీ ప్రేక్షకులతో కిటకిటలాడాయి. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ అభించింది.పెద రాయుడు సినిమా డైలాగ్ కింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు.అప్పటి వరకు చిరంజీవి ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల రూపాయల వసూళ్ల పేరుమీద ఉన్న రికార్డును ఈ సినిమా 12 కోట్ల రూపాయలు సాధించి చరిత్ర సృష్టించింది.