వినోదం

సాయి ప‌ల్ల‌విని బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్.. అంత త‌ప్పు ఏం చేసింది..!

మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సొంత టాలెంట్‌తో మంచి పేరు ప్రఖ్యాత‌లు సాధించింది. ఆచితూచి సినిమాలు చేస్తున్న సాయి ప‌ల్ల‌వి మ‌రి కొద్ది రోజుల‌లో అమ‌ర‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ అంతా భావిస్తుంది. ఇక మూవీకి భారీ ఎత్తునే ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్లలో సాయి పల్లవితోపాటు టీమ్ అంతా బిజీగాఉన్నారు. అయితే సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందు ఎక్స్ అకౌంట్లో బాయ్‌కాట్ సాయి పల్లవి అంటున్నారు కొందరు నెటిజన్లు.

ఆమె ఇండియన్ ఆర్మీని అవమానించిందంటూ రెండేళ్ల కిందటి ఓ వీడియోను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి విమర్శిస్తుండటం గమనార్హం. విరాట పర్వం మూవీ రిలీజ్ కు ముందు ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సాయిపల్లవితోపాటు అమరన్ మూవీ టీమ్ మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న‌ వీడియోలో హింస గురించి సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ‘‘పాకిస్థాన్‌లో ఉండే మనుషులు భారత సైనికులను టెర్రరిస్ట్ గ్రూప్‌లాగా భావిస్తారు. కానీ మనకు పాకిస్థాన్ సైన్యం టెర్రరిస్టుల్లాగా కనిపిస్తుంది. అలా అభిప్రాయాలు మారుతుంటాయి. నాకు అస్సలు ఈ హింస అంతా ఎందుకో అర్థం కాదు’’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవ్వడంతో సాయి పల్లవిపై నెగిటివిటీ తప్పడం లేదు.

people want to ban sai pallavi know the reasons

ఆమె ఇండియన్ ఆర్మీనే కాదు.. వాళ్ల కుటుంబాలను కూడా అవమానించిందని ఒకరు.. సాయి పల్లవి హీరో టెర్రరిస్ట్ కసబ్ అని మరొకరు.. ఇలాంటి వ్యక్తి సీతగా ఎలా నటిస్తోందని ఇంకొకరు కామెంట్స్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి అలా మాట్లాడి ఇప్పుడు మేజర్ ముకుంద్ బయోపిక్ అయిన ‘అమరన్’లో ఎలా నటించావంటూ తనను ప్రశ్నిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఒకప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసింది సాయి పల్లవి. అమరన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి ఈ మధ్యే నేషనల్ వార్ మెమోరియల్ కు వెళ్లి.. మేజర్ ముకుంద్ వరదరాజన్ తోపాటు ఇతర అమరులైన జవాన్లకు నివాళులర్పించింది. మ‌రి ఇప్పుడు జ‌రుగుతున్న నెగెటివ్ ప్రచారానికి సాయి ప‌ల్ల‌వి చెక్ పెడుతుందా లేదా చూడాలి.

Sam

Recent Posts