వినోదం

వంటలక్కకి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. స్టార్ హీరోయిన్స్ కు మించి..!!

బుల్లితెర నటి ప్రేమి విశ్వనాథ్ అంటే ఎవరు అంతగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ వంటలక్క అంటే ఇంట్లో ఓ మూలన కూర్చుండే ముసలావిడ కూడా గుర్తుపట్టేస్తుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ రేంజ్ లో వంటలక్క గుర్తింపు సంపాదించుకుంది. కార్తీకదీపం సీరియల్ తో ఈమె కెరియర్ మారిపోయింది. టిఆర్పి రేటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ సీరియల్ ప్రేమి విశ్వనాథ్ జీవితాన్నే మార్చిందని చెప్పవచ్చు. సహజ నటనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అలాంటి వంటలక్క జీవితం గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం..

వంటలక్కకు కోట్ల విలువచేసే ఆస్తులు నెలకు లక్షల సంపాదన ఉన్నా చాలా సింపుల్గా ఉంటుందట.. ఇక ఆమెకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు.. ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందిన అమ్మాయి. ఆమెకు అక్కడ రెండు స్టూడియోలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మాలీవుడ్ లో తెరకెక్కే చిత్రాలు సీరియల్స్ అక్కడ షూటింగ్ జరుపుకుంటాయని తెలుస్తోంది. ఇండ్లు మరియు లగ్జరీ కార్లు అంటూ స్థిరచర ఆస్తుల రూపంలో కోట్లాది ఆస్తులు కూడబెట్టారట. ఒక అంచనా ప్రకారం ప్రేమి విశ్వనాథ్ ఆస్తుల విలువ 40 కోట్లకు పై మాట అని అంటున్నారు.

premi vishwanath net worth and assets value

ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్యుడు. ఆయన సంపాదన కూడా కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. మలయాళ సీరియల్ నటిగా కెరియర్ ప్రారంభించిన ప్రేమి విశ్వనాథ్ కార్తిక దీపం సీరియల్ తో తెలుగు అభిమానులకు దగ్గరయింది. దీంతో పాపులారిటీ పెరగడంతో సినిమా ఆఫర్స్ కూడా అనేకం వస్తున్నాయి.

Admin

Recent Posts