వినోదం

Premikudu Movie : డైరెక్టర్ శంకర్ తీసిన ప్రేమికుడు సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. బెదిరింపుల వెనుక గల కారణమేమిటి..?

Premikudu Movie : డైరెక్టర్ శంకర్ భారతీయ సినీచరిత్రలో ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. ఆయన దర్శకుడిగా ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు తీసి అభిమానులకు అలరించారు. 1993లో అర్జున్ హీరోగా నటించిన జెంటిల్ మ్యాన్ చిత్రంతో దర్శకుడుగా తన సినీ కెరీర్ ని ప్రారంభించారు శంకర్. ఈ సినిమా అప్పటిలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు కుంజుమన్ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చగా ప్రభుదేవా చికుబుకు చికుబుకు రైలే అనే స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఈ సినిమా నిర్మాత కుంజుమన్ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. దానితో శంకర్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత కుంజుమన్. ఇక శంకర్ ప్రభుదేవా హీరోగా ప్రేమికుడు అనే సినిమా కథను నిర్మాతకు వినిపించారు. ఈ సినిమాలో గవర్నర్ కి పేదవారు అంటే అసహ్యం. అలాంటి గవర్నర్ కూతురిని హీరో ప్రేమిస్తాడు. ఈ కథ నచ్చడం.. నిర్మాత కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో షూటింగ్ ప్రారంభించారు.

premikudu movie interesting facts to know

అయితే ప్రేమికుడు సినిమాలో గవర్నర్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడని అదే సినిమాకు థీమ్ అనే విషయం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కార్యాలయం వరకు చేరింది. ఆ సమయంలో గవర్నర్ గా చెన్నారెడ్డి ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. ఈ విషయం తెలియగానే ప్రేమికుడు సినిమాను ఆపివేయాలని సినిమాలో గవర్నర్ కు సంబంధించిన సన్నివేశాలను తొలగించాలని గవర్నర్ చెన్నారెడ్డి కార్యాలయం నుండి నిర్మాతకు బెదిరింపులు వెళ్లాయట. ఆ బెదిరింపులతో నిర్మాత కుంజుమన్ ఈ విషయాన్ని సీఎం జయలలిత దృష్టికి తీసుకువెళ్లారట.

దాంతో జయలలిత సినిమాలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు లేకుండా తీసుకోవాలని పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సీఎం పర్మిషన్ ఇవ్వడంతో ప్రేమికుడు సినిమా పట్టలెక్కి చక చకా షూటింగ్ పనులు పూర్తయ్యింది. ఆ తరవాత సినిమా చూసిన జయలలిత కూడా సినిమా చాలా బాగుందని చెప్పారట. అలా గవర్నర్ అడ్డుకున్న ప్రేమికుడు సినిమా ఎన్నో ఒడిదుడుకుల మధ్య షూటింగ్ పూర్తి చేసుకుని 17 సెప్టెంబర్ 1994న విడుదలైంది. ఈ చిత్రం వాణిజ్యపరంగా ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా రెండు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా అనేక గుర్తింపులు దక్కించుకుంది.

Admin

Recent Posts