కథానాయకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణ ఆ తర్వాత ఆ పద్మాలయ స్టూడియో నిర్మించి, నిర్మాతగా మారారు. ఆయనలో దర్శకుడు, ఎడిటర్ కూడా ఉన్నారు. 350 కి పైగా సినిమాలలో నటించిన కృష్ణ అత్యధికంగా మల్టీస్టారర్ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ వారి అదృష్టం వల్లే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోగలిగారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి తండ్రి ప్రోత్సాహంతో 19 సంవత్సరాల వయసులో మద్రాసు సినీ ఇండస్ట్రీకి చేరుకున్న కృష్ణ, వారాహి స్టూడియో అధినేత చక్రపాణి, ఆనందబాబులను కలిశారు.
ఆ తర్వాత చక్రపాణి కృష్ణను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు వయసు ఇంకా చాలా చిన్నది, ప్రస్తుతం అనుభవం కోసం నాటకాలలో ట్రై చేయమని తెలిపారు. ఆ తర్వాత చక్రపాణి సహాయంతో గోపాలకృష్ణ దగ్గర నాటక రంగ ప్రవేశం చేసి అక్కడ మొదటిసారి, చేసిన పాపం కాశీకి పోయినా అనే నాటకంలో శోభన్ బాబు మొదటి హీరోగా నటించిగా, రెండవ హీరోగా కృష్ణ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత చైర్మన్ అనే నాటకంలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే నాటకాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణకు, ఇందిరా దేవిని ఇచ్చి వివాహం జరిపించారు. అలా 1942 నవంబర్ 20న ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయినప్పటికీ కృష్ణ ఇండస్ట్రీ లోకి రాలేదు. హీరో కాలేదు. ఇక పెద్ద కుమారుడు రమేష్ బాబు జన్మించిన తర్వాత కృష్ణకు మొదటిసారి హీరోగా తొలి అవకాశం లభించింది. అలా కృష్ణ వెండితెరకు తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. చెప్పాలంటే రమేష్ బాబు జన్మించిన తర్వాతే హీరోగా ఆయన కెరీరకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. అంతటి అదృష్టాన్ని తెచ్చి పెట్టిన రమేష్ బాబు అదే ఏడాది తన కళ్ళముందే మరణించడంతో జీర్ణించుకోలేకపోయిన కృష్ణ మానసికంగా కృంగిపోయి మరణించారు అనే వార్తలు కూడా వినిపించాయి.