RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చరణ్, తారక్‌లు ఇందులో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి విదేశీ ఫిలిమ్ మేకర్స్ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఇందులో చరణ్ అల్లూరిగా, తారక్ భీమ్‌గా నటించి అలరించారు. అలాగే ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు మరో మెయిన్ హైలైట్ అని చెప్పవచ్చు.
అయితే ఎంతటి దర్శకుడు అయినా సరే కొన్ని సార్లు బ్లండర్ మిస్టేక్స్ చేస్తుంటారు. సినిమాల నిర్మాణంలో చాలా పెద్ద తప్పిదాలే చేస్తుంటారు. కానీ సినిమా చూసే ప్రేక్షకులకు అవి సరిగ్గా తెలియవు. వారు గుర్తించలేరు. కొన్ని మిస్టేక్స్ అయితే మనం సినిమాను ఎన్ని సార్లు చూసినా గుర్తు పట్టలేం. ఆర్ఆర్ఆర్ మూవీలోనూ సరిగ్గా అలాంటి తప్పే ఒకటి చోటు చేసుకుంది. అది చిన్నా చితకా తప్పు కాదు.. చాలా పెద్ద తప్పు. ఇంతకీ ఆ తప్పు ఏమిటంటే..
భీమ్ అతని అనుచరులు ఒక వ్యాన్‌లోంచి వన్య ప్రాణులను బ్రిటిష్ వారి మీదకు ఉసిగొల్పుతారు కదా. ఈ సీన్‌కు థియేటర్లలో ఈలలు, చప్పట్లు పడ్డాయి. థియేటర్లు అన్నింటినీ షేక్ చేసే సీన్ ఇది. అయితే ఇందులోనే రాజమౌళి ఒక తప్పు చేశారు. వ్యాన్‌ను బ్రిటిష్ వారి కాంపౌండ్‌లో పూర్తిగా ఆపేయకముందు పైన ఉన్న వ్యక్తి పరదాను తీసేస్తాడు. దీంతో భీమ్ జంతువుల మధ్యలో కూర్చుని కనిపిస్తాడు. అదే సమయంలో అతనికి కుడి వైపు చూస్తే ఒకే బోనులో రెండు పులులు, రెండు జింకలు ఉంటాయి. అయితే ఇదే రాజమౌళి చేసిన తప్పు. ఒకే బోనులో ఉన్నప్పటికీ పులులు ఆ జింకలను ఎందుకు చంపలేదు.. అన్న ప్రశ్నే ఉత్పన్నమవుతోంది. చంపడం వాటి నైజం కదా. మరి అలా ఎలా జరిగింది ? రాజమౌళి ఎందుకు చూసుకోలేదు ? అన్న సందేహాలు వస్తున్నాయి.
వాస్తవానికి ఇది చాలా పెద్ద తప్పే. అయితే ఈ సీన్‌ను పదేపదే స్లో మోషన్‌లో చూస్తేనే మనకు ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ సీన్లు చాలా వేగంగా వస్తుంటాయి. వాటిల్లో ఈ ఒక్క ఫ్రేమ్‌లో జరిగిన తప్పును సాధారణంగా అయితే ప్రేక్షకులు గుర్తించలేరు. కనుకనే ఈ సీన్ గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే అన్ని విషయాల్లోనూ రాజమౌళి పర్‌ఫెక్ట్‌గా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు ? అనేది అంతుబట్టకుండా ఉంది. ఏది ఏమైనా.. ఇలాంటి తప్పులను మాత్రం ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. కనుకనే దీన్ని గుర్తించలేకపోయారని చెప్పవచ్చు.