Samantha : అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే 2 రోజుల్లోనే ఈ మూవీ రూ.100 కోట్లకు పైగానే గ్రాస్ సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే ఈ మూవీతో మరోమారు బన్నీ, రష్మిక మందన్న, సుకుమార్‌లకు మంచి పేరు రాగా.. కేవలం ఒక్క ఐటమ్ సాంగ్‌లో నటించినందుకే సమంతకు కూడా ఎక్కువగానే పేరు వచ్చింది. దీంతో ఆమె పేరు ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా వినబడుతోంది.
ఇక పుష్ప మూవీలో సమంత సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విడాకుల అనంతరం సమంత తొలిసారి తెరపై కనిపించడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐటమ్ సాంగ్ గా ఇది ఆమెకు తొలి పాట. అయినప్పటికీ ఎంతో బాగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ.. కొందరు ప్రేక్షకులు మాత్రం సమంతను ఈ సాంగ్ నేపథ్యంలో విమర్శిస్తున్నారు.
సమంత హీరోయిన్ గా మంచిగానే సంపాదిస్తుంది. అంతకన్నా పేరు కూడా బాగానే ఉంది. అలాంటప్పుడు ఇలా ఐటమ్ సాంగ్‌లను చేయడం ఎందుకు ? స్కిన్ షో చేయడం ఎందుకు ? అని సమంతను ప్రశ్నించారు. అయితే అన్నింటికీ సమంత నవ్వుతూనే సమాధానాలు చెప్పింది. తనపై వస్తున్న విమర్శలకు జవాబులు ఇచ్చింది.
పుష్ప మూవీలో ప్రత్యేక సాంగ్‌లో నటించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని సమంత చెప్పింది. ఈ సాంగ్ ఒక రేంజ్‌లో పాపులర్ కావడం మరింత ఆనందాన్నిస్తుందని తెలియజేసింది. ఇందులో అల్లు అర్జున్‌తో కలిసి పోటా పోటీగా డ్యాన్స్ చేశానని, అయితే ఈ పాట నేపథ్యంలో వస్తున్న వివాదాలన్నీ పిచ్చితనం అంటూ కొట్టి పారేసింది. తనపై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్‌కు కూడా సమంత స్పందించింది. తాను వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, కొన్ని మీమ్స్ ను తన సోషల్ ఖాతాల్లో షేర్ చేసింది కూడా..!