ఇటీవల సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ చిన్నప్పటి పిక్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. గుండులో, బూరె బుగ్గలతో అమాయకంగా.. కనిపిస్తున్న ఈ చిన్నారిని చూసి అభిమానులు మైమరచిపోతున్నాయి. మరి ఆమె ఎవరా అనే కదా మీ డౌట్.. సమీరా రెడ్డి. నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన సమీరా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆశోక్ చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఆమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. పెళ్లి తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న సమీరా.. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. కెరీర్ కు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తుంది.
తాను ప్రెగ్నేన్సీ సమయంలో లావుగా మారడంతో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నానని.. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా శ్రమించానని కూడా చెప్పుకొచ్చింది. అలానే 1998లో మహేష్ బాబు సినిమా కోసం తొలిసారిగా తాను ఆడిషన్ కు వెళ్లి.. వాళ్లు ఇచ్చిన టాస్క్ సరిగా చేయక కన్నీళ్లతో ఇంటికి వచ్చినట్లు చెప్పుకొచ్చింది సమీరా. ఛాన్స్ అలా మిస్ కావడంతో అప్పటి వరకు తాను చేస్తున్న జాబ్ కంటిన్యూ చేయాలని అనుకుందట సమీరా. ఓ ప్రైవేట్ ఆల్చమ్ లో అవకాశాలు రావడం. ఆ తర్వాత వెండితెరపై వెలగడం చక చకా జరిగిపోయాయి. అంతేకాకుండా ఆడిషన్ కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు. సమీరా వెళ్లింది రాజకుమారుడు సినిమా కోసమే అని తెలుస్తుంది. సమీరా 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు.