వినోదం

ఏంటి సంజ‌య్ ద‌త్ నాలుగో పెళ్లి చేసుకున్నాడా.. వైర‌ల్ అవుతున్న వీడియో..

బాలీవుడ్ హీరో సంజయ్ ద‌త్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌ల సంజ‌య్ ద‌త్ సౌత్ సినిమాల‌లో కూడా క‌నిపిస్తూ అల‌రిస్తున్నాడు. విభిన్న పాత్రల్లో నటించి అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో ‘రాకీ’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజూ భాయ్ ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక వివాదాల‌తో కూడా చాలా సార్లు వార్త‌ల‌లో నిలిచాడు సంజ‌య్ ద‌త్. తన జీవితంలో దాదాపు 308 మంది మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు సంజయ్ స్వయంగా తెలిపాడు.

తాను ఎఫైర్ పెట్టుకున్న‌ 308 మంది మహిళల్లో పలువురు బాలీవుడ్ నటీమణులు కూడా ఉన్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు తన తరానికి చెందిన ప్రతి నటితో డేటింగ్ చేసాడు .ఇక సంజ‌య్ మొత్తంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.సంజయ్ మొద‌ట‌ రియా పిళ్లైని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎయిర్ హోస్టెస్ మరియు మోడల్. అంతకు ముందు రిచా శర్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు త్రిషాలా దత్ అనే కుమార్తె ఉంది. రిచా 1996లో బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించింది. సంజ‌య్ ద‌త్ ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి మాన్య‌త‌ని చేసుకున్నాడు. 2008లో వీరి వివాహం జరిగింది.ఈ జంట గోవాలో వివాహం చేసుకున్నారు.

sanjay dutt married again viral video truth

అయితే ఇప్పుడు సంజ‌య్ ద‌త్ నాలుగో పెళ్లి చేసుకున్నాడ‌ని నెట్టింట ఓ వీడియో వైర‌ల్ అవుతుంది.ఇందులో సంజ‌య్ ద‌త్, మాన్య‌త అగ్ని గుండం చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేస్తున్నారు. చూస్తుంటే వారు గృహ ప్ర‌వేశ కార్యక్ర‌మంలో భాగంగా అలా చేస్తున్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల సంజ‌య్ ద‌త్ త‌మ ఇంటిని పున‌రుద్ధ‌రించ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా హోమం చేయించార‌ని అందుకే త‌న భార్య‌తో క‌లిసి అగ్ని గుండం చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేస్తున్నార‌ని అంటున్నారు. వీడియోలో సంజయ్ నారింజ రంగు కుర్తా మరియు ధోతీ ధరించి కనిపించగా, మాన్యతా క్రీమ్ క‌లర్ డ్రెస్ ధరించి కనిపించారు.

Sam

Recent Posts