వినోదం

Savitri Soundarya And Sai Pallavi : సావిత్రి, సౌందర్య, సాయిపల్లవి.. వీరి ముగ్గురిలోనూ ఉన్న కామ‌న్ పాయింట్స్ ఇవే..!

Savitri Soundarya And Sai Pallavi : సినిమా అనేది ఒక రంగుల ప్ర‌పంచం. ఇక్కడ అవకాశాలు దక్కించుకోవటం చాలా కష్టమైన పని. ఒకవేళ అవకాశం దక్కినా… తమను తాము నిరూపించుకుని నిలబడటం చాలా క‌ష్ట‌మైన ప‌ని. తనకు లభించిన చిన్న చిన్న అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని తమ ప్రతిభ ఏంటనేది నిరూపించుకున్న తార సాయి పల్లవి. అభిమానుల దృష్టిలో ఆమె ఒక లేడి సూపర్ స్టార్.సావిత్రి, సౌందర్య త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్‌లో అల‌రించింది సాయి ప‌ల్ల‌వినే అంటారు. అయితే ఈ ముగ్గురికి సంబంధించిన ఆసక్తిక‌ర విష‌యాలు గ‌మ‌నిస్తే.. సావిత్రికి కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆఖరి రోజుల్లో అలాంటి దీనమైన స్థితి ఎదుర్కోవడానికి కారణం ఆమెకున్న మంచితనమే అంటూ కొంతమంది అవహేళనగా మాట్లాడేవారు .

సావిత్రి కి మరీ మంచితనం ఎక్కువ అని మంచితనం కూడా హద్దుల్లోనే ఉండాలి అని.. మంచితనం టూ మచ్ అయిపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అని.. అప్పట్లో జనాలు ఆమెపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు . హీరోయిన్ సౌందర్య కూడా సావిత్రి లాగా దానధర్మాలు ఎక్కువగా చేస్తూ వచ్చేదట. అంతేకాదు, ఆమె రెమ్యూనరేషన్ లో సగానికి పైగానే తోటి ఆర్టిస్టులకి ..హెల్ప్ కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం ఖర్చు పెట్టేదట .ఇప్పుడు అదే పని చేస్తుంది హీరోయిన్ సాయి పల్లవి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి కూడా ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉంటుందట.

Savitri And Soundarya And Sai Pallavi have this one common point

డబ్బు గురించి పెద్దగా పట్టించుకోదట. ఆమె మంచితనమే ఆమెకు ఇంపార్టెంట్ అట. దీంతో వీళ్ళ ముగ్గురిలో ఉన్న బ్యాడ్ అండ్ గుడ్ క్వాలిటీ ఇదే అంటున్నారు జనాలు..!సాయి పల్లవి శాంతామరై తమిళనాడులోని కోటగిరి లో 1992 మే 9న జన్మించారు. విజయ్ టీవీలో 2008లో వచ్చిన ‘ఉంగలిల్ యార్ ఆడుతా ప్రభుదేవా’ డ్యాన్స్ రియాలీటీ షోతో వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఏడాది తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 4’లో పార్టిసిపేట్ చేశారు. తెలుగు ప్రజలకు ఆ షో ద్వారా ఆమె పరిచయమయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే… ‘ఢీ 4’ కంటే ముందే 2005లో ‘కస్తూరి మాన్’ అనే మలయాళ సినిమాలో, 2008లో ‘ధామ్ ధూమ్’ అనే తమిళ సినిమాలో సాయి పల్లవి బాలనటిగా చేశారు.

Admin

Recent Posts