వినోదం

Shriya Saran : శ్రియ ఆ తెలుగు హీరోతో 5 ఏళ్లు స‌హ‌జీవ‌నం చేసిందా..?

Shriya Saran : ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించిన అందాల ముద్దుగుమ్మ శ్రియ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌ల కొంచెం సినిమాల త‌గ్గించిన శ్రియ‌.. ఆర్ ఆర్ ఆర్ మూవీలో చిన్న పాత్ర చేశారు. అజయ్ దేవ్ గణ్ భార్యగా చేసి మెప్పించారు. ఇక తెలుగులో శ్రియ హీరోయిన్ గా నటించిన చివరి కమర్షియల్ ఎంటర్టైనర్ పైసా వసూల్. బాలయ్యకు జోడీగా నటించింది. అయితే శ్రియ ఇటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు.సోష‌ల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.

శ్రియ త‌న కెరీర్ నెమ్మదించాక రష్యన్ ప్రియుడు ఆండ్రూని శ్రియ వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరయ్యారు. ఇక పిల్లల్ని కూడా ఆమె రహస్యంగానే కన్నారు. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం చాలా కాలం తర్వాత శ్రియ ఫ్యాన్స్ తో పంచుకుంది. శ్రియా తల్లయ్యిందన్న ఆ వార్త అందరికీ షాక్ ఇచ్చింది.. ఇక శ్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది.

Shriya Saran is it true that she is with rana

అయితే తాజాగా శ్రియ‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఓ స్టార్ హీరోతో ఐదు సంవత్సరాలు ముంబై లోశ్రియ సహజీవనం చేసింది అంటూ తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. మరి ఆ స్టార్ హీరో ఎవరూ అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు రానా దగ్గుబాటి అని అంటున్నారు. శ్రీయ, రానా ఇద్దరు కలిసి ముంబై లో ఐదు సంవత్సరాలు సహజీవనం చేశారంటూ అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి. ఓ పార్టీలో వీరిద్ద‌రికి ప‌రిచ‌యం ఏర్ప‌డి అలా ఇద్దరు ఒకే ఇంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నారట. ఇక అప్పట్లో వీరిని చూసిన వాళ్ళందరూ త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కుతార‌ని అనుకున్నారు. కాని అందుకు భిన్నంగా శ్రీయ .. ఆండ్రి అనే రష్యన్ బిజినెస్ మాన్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ప్ర‌స్తుతం అత‌నితో సంతోషంగానే ఉంటుంది.

Admin

Recent Posts