Sobhan Babu : సోగ్గాడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఎవరైన ఉన్నారు అంటే అది శోభన్ బాబు. పోటీగా స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా తనదైన శైలిలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకొని సత్తా చాటారు. ముఖ్యంగా మహిళల నుంచి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుల్లో శోభన్ బాబు ఒకరు కాగా, ఆయన ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకునేవి.ఆయన సినిమాలు మొదటి వారం ఆడవాళ్లే ఎక్కువగా చూసేవారు. మొదట్లో సీనియర్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన ఆయన హీరోగా కూడా తనదైన శైలిలో హిట్స్ అందుకునేవారు.
శోభన్ బాబు క్రమశిక్షణలో నిబద్దతతో ఉండేవారు. సమయానికి షూటింగ్ కి వచ్చి తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లేవారు. శోభన్ బాబు సినిమాల ద్వారా సంపాదనను చాలా జాగ్రత్తగా దాచుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవారు. మద్రాస్ లో అలాగే హైదరాబాద్ లో అప్పట్లో చాలా భూములు కొనుగోలు చేశారు. 2008లో ఆయన మరణించే సరికి అప్పట్లో వాటి విలువ 80వేల కోట్లు దాటాయి. అది ఇప్పుడు లక్షల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. అయితే చెన్నై మెయిన్ రోడ్ కు ఆనుకుని ఉన్న 30 ఎకరాల తోటని, హీరో మాధవన్ తాత దగ్గర నుంచి శోభన్ బాబు కొనుగోలు చేశారని, దానికోసం అప్పట్లోనే రూ.30 లక్షలు ఖర్చు చేశారని , ఆ ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇవ్వడం కోసం తన దగ్గరే రూ.2 లక్షల డబ్బుని శోభన్ బాబు అప్పుచేశాడని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
శోభన్ బాబుని ఆదర్శంగా తీసుకుని మురళీమోహన్, తాను రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చామని చంద్రమోహన్ చెప్పారు. ఇక వారసుల్ని ఇండస్ట్రీలోకి తీసుకురాని హీరోల్లో శోభన్ బాబు, మురళీమోహన్ ఉండగా, ఆ కొడుకులకు తమ రియల్ ఎస్టేట్ బాధ్యతలు అప్పజెప్పారని తెలిపారు. శోభన్ బాబు కొడుకు కరుణాకర్.. తండ్రి కూడబెట్టిన ఆస్తుల్ని చూసుకుంటూ వస్తున్నాడని చంద్రమోహన్ అన్నారు.. 1970ల్లో అన్నానగర్ లో ఎకరం రూ.5 వేల వరకు ఉండేదని, ఇప్పుడు ఆ ఎకరం భూమి రూ.50 కోట్లకు చేరింది. ఈ లెక్కన చూసుకుంటే సోగ్గాడు శోభన్ బాబు ఆస్తులు కొన్ని వేల కోట్లు ఉంటాయి అని తెలుస్తుంది. ఏమైన క్రమ శిక్షణతో సోగ్గాడు చాలా ఆస్తులే కూడబెట్టాడు.