వినోదం

స్టార్ హీరోస్ వారి కొడుకులతో కలిసి నటించిన సినిమాలు !

1. చిరంజీవి, రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ కింద రాంచరణ్ నటించాడు. అలాగే రామ్చరణ్ హీరోగా చేసిన బ్రూస్లీ మూవీ లో చిరంజీవి గెస్ట్ రోల్ చేశాడు. చిరుత లో కూడా ఒక పాటలో కనిపించారు చిరంజీవి. ఇక ఆచార్య సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

2. ఎన్టీఆర్, బాలకృష్ణ..

బాలకృష్ణ.. ఎన్టీఆర్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. బాలయ్య చైల్డ్ ఆర్టిస్టుగా తాతమ్మకల, రామ్ రహీం, దానవీరశూరకర్ణ సినిమా చేశారు. అలాగే బాలయ్య హీరోగా నటించిన‌ప్పుడు కూడా ఎన్టీఆర్ కొన్ని పాత్రలు చేశారు.

3. మోహన్ బాబు, మంచు మనోజ్

మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ తో ఝుమ్మంది నాదం మరియు పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలు చేశారు.

star actors who acted with their sons

4. ఏ.ఎన్.ఆర్ మరియు నాగార్జున

నాగేశ్వర రావు మరియు నాగార్జున కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇద్దరూ ఇద్దరే, కలెక్టర్ గారి అబ్బాయి, అగ్ని పుత్రుడు, శ్రీ రామదాసు మరియు మనం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

5. కృష్ణంరాజు, ప్రభాస్

కృష్ణంరాజు వారసత్వాన్ని ముందుకు తీసుకు వస్తూ ప్రభాస్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ప్రభాస్ మరియు కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్, రాధే శ్యామ్ సినిమాలు చేశారు.

Admin