వినోదం

Suman : హీరో సుమ‌న్ ని నీలిచిత్రాల‌ కేసులో ఇరికించింది ఎవరో తెలుసా.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

Suman : టాలీవుడ్ లో హీరోగా చేసి ఆ తర్వాత సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుమన్. అప్పట్లో చిరంజీవి లాంటి స్టార్ హీరోకు కూడా పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. కొంతకాలానికి కెరీర్ పరంగా కాస్త డీలా పడిన ఆయన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తున్నారు. సుమన్‏కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక స్టార్ హీరోగా ఎదుగుతున్న స‌మ‌యంలో సుమ‌న్ ఇంటిపై పోలీసుల రైడ్ జ‌రిగింది. ఆ కేసు వ‌ల్ల సుమ‌న్ జైలు జీవితాన్ని సైతం గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయితే గ‌తంలో సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.

అస‌లు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్ప‌డానికి త‌న వ‌ద్ద కానీ పోలీసుల ద‌గ్గ‌ర కానీ స‌మాధానం లేద‌నన్నారు. త‌న‌ను సైదాబాద్ కోర్టులో హాజ‌రుప‌రిచార‌ని తెలిపారు. అమ్మాయిల‌ను వేధించిన‌ట్టు.. బ్లూఫిల్మ్ లు తీసిన‌ట్టు ఆరోపించి కేసులు వేశార‌ని చెప్పారు. కానీ ఎవ‌రిద‌గ్గ‌ర ఎలాంటి ఆధారాలు లేవ‌న్నారు. ఆధారాలు అడిగితే ఇన్వెస్టిగేష‌న్ జ‌రుగుతుంద‌ని చెప్పేవార‌ని అన్నారు. యాంటి గుండా యాక్ట్, ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేయ‌డం వ‌ల్ల త‌నకు బెయిల్ కూడా దొర‌క‌లేద‌ని చెప్పారు. త‌న‌ను దారుణ‌మైన గ‌దిలో జైలులో బంధించార‌ని చెప్పారు.

suman told interesting facts about his film career

ఓసారి క‌రుణానిధి గారు వ‌చ్చి త‌న ప‌రిస్థితి చూసి చ‌లించిపోయార‌ని, జైలు అధికారుల‌ను హెచ్చ‌రించి త‌న‌ను వేరే గ‌దికి మార్పించార‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా త‌న‌పై ఓ జ‌రిగిన ఓ పొలిటిక‌ల్ కుట్ర వ‌ల్లే జైలు జీవితం అనుభ‌వించాల్సి వ‌చ్చింద‌న్నారు. అయితే సుమ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ వాళ్లు ఎవ‌రా అన్నది మాత్రం బ‌య‌ట‌పెట్టలేదు. క‌రుణానిధి, ఎంజేఆర్ లాంటి వాళ్లే త‌న‌కు సాయం చేయ‌లేక‌పోయారని బాధ‌ప‌డ్డారు. కాగా సుమన్ తన సినీ కెరీర్‌లో దాదాపు 150పైగా చిత్రాల్లో నటించారు.

Admin

Recent Posts