Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఈ 8 మంది టాలీవుడ్ స్టార్లకు ఉన్న రెస్టారెంట్లు ఏవో మీకు తెలుసా..? వాటి వివరాలు, స్పెషాలిటీలు ఇవే..!

Admin by Admin
September 29, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను చక్కగా ఫాలో అవుతుంటారు సినిమా వాళ్లు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఆయా వ్యాపారాల్లో కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటారు .ఏమో సినిమా అవకాశాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం .ఎవరు ఓవర్ నైట్ స్టార్ అవుతారో.. ఎవరూ ఏ సినిమాతో చతికిలపడతారో అస్సలు అర్దం కాదు. అందుకే సినిమా అవకాశాలకి తోడు వేరే ఆదాయమార్గాలు చూసుకోవడం తప్పేం కాదుగా. సినిమా వాళ్లు ఎక్కువగా హీరోయిన్స్ ఇంటీరియర్స్ అటువైపు దృష్టిపెడితే, హీరోస్ రెస్టరెంట్స్,ఈవెంట్స్ ఇటువైపుగా కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. అలాంటి వాళ్లలో ప్రముఖ హీరోలు ఉండడం విశేషం.

జై సినిమాతో పరిచయం అయిన నవదీప్ చందమామతో సూపర్ హిట్టు కొట్టారు. ఆ తర్వాత బాద్‌షా, ధృవ సినిమాల్లో నటించారు. మరోవైపు గచ్చిబౌలిలో బిపిఎమ్ అనే పబ్ ఉంది నవదీప్ కి. బిపిఎం అంటే బీట్స్ ప‌ర్ మినిట్. ఇక్కడ ఎక్సోటిక్ డ్రింక్స్ తోపాటు టేస్టీ స్టాటర్స్ కూడా ఉంటాయి. శతమానంభవతితో హిట్ కొట్టిన శర్వానంద్ మహానుభావుడుగా మన ముందుకువ‌చ్చాడు. సినిమాల్లోకి వచ్చాక మొదటి నుండి కూడా ఆచితూచి అడుగులేస్తూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అరకు లాంటి ప్రాంతాల్లో ఉండే వాతావరణాన్ని హైదరాబాద్ లో ప్రతిబింబించేలా బాంబూ స్టిక్స్ తో, పచ్చటి చెట్లమధ్య ఉన్నట్టు ఏర్పాటు చేసిన కాఫీ షాప్ నిర్వహణ చూసుకుంటున్నాడు. దీని పేరు బీన్జ్ కాఫీ షాప్. తెలుగువంటకాలైన బజ్జీలు, పునుగులు ఇక్కడ బాగా ఫేమస్.

these 8 tollywood stars have restaurants

మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా జూబ్లీహిల్స్ లో పబ్ ఉంది. అదే 800 జూబ్లీ. వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్లేస్. ఇక్కడ పలు రకాల డ్రింక్స్ తోపాటు ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. యువసామ్రాట్ నాగార్జున రెస్టారెంట్ పేరు ఎన్ గ్రిల్. ఈ రెస్టారెంట్ ని మీరు మనం సినిమాలో చూడొచ్చు. అందులో నాగార్జున సమంత‌కి పాఠాలు చెప్పే సీన్ ఈ రెస్టరెంట్ లోనే తీశారు. చాలా చాలా లగ్జీరియస్ ఇంటీరియర్ తో ఉన్న ఈ రెస్టరెంట్ ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే ప్లేసుల్లో ఇది ఒకటి. వివాహ భోజనంబు. వింతైన వంటకంబు కాన్సెప్ట్ ని సందీప్ కిషన్ ఫాలో అవ్వడమే కాదు తన రెస్టరెంట్ కు కూడా అదే పేరుపెట్టుకున్నాడు. వివాహ భోజనంబు అని రాయలసీమ రుచులు, తెలంగాణ‌, ఆంధ్రా వంటకాలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నాన్ వెజ్ థాలీ ఇక్కడ స్పెషల్ అండ్ వెరీ టేస్టీ అని టాక్.

అతనొక్కడేతో దర్శకుడిగా పరిచయం అయి కిక్, రేసుగుర్రం, ధృవ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మారిన సురేందర్ రెడ్డి కూడా రెస్టరెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. మొదట కొత్తగా ఏదన్నా రెస్టారెంట్ ని ప్రారంబించాలనుకున్న ఆయన రిస్క్ ఎందుకు అని సౌత్ ఇండియన్ రెస్టరెంట్ ఉలవచారు ఫ్రాంచైజీ తీసుకున్నారు. సై సినిమాతో మంచి గుర్తింపు పొందిన శశాంక్ అనుకోకుండా ఒక రోజులో ఛార్మీతో నటించారు. అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఉన్నారు. మరోవైపు మాయాబజార్ రెస్టరెంట్ నిర్వహణ చూసుకుంటున్నారు. సింపుల్ ఇంటీరియర్స్, మాయాబజార్ థీమ్స్ తో ఫ్యామిలిస్ ని అట్రాక్ట్ చేసే ఈ రెస్టరెంట్ లో మొగలాయి ఫుడ్ చాలా ఫేమస్‌.

Tags: restaurants
Previous Post

మన పురాణాల ప్రకారం ఈ 8 మంది ఇంకా బతికే ఉన్నారట.. ఇంతకీ వారెవరో తెలుసా..?

Next Post

జ‌గ‌న్ స‌ర్కార్ ల‌డ్డూల‌ను క‌ల్తీ చేసింది: ష‌ర్మిళ‌

Related Posts

ఆధ్యాత్మికం

పిల్ల‌లు వీరికి పూజ‌లు చేస్తుంటే చ‌దువు బాగా వ‌స్తుంది.. తెలివితేట‌లు పెరుగుతాయి..!

July 12, 2025
ఆధ్యాత్మికం

పిండ ప్ర‌దానం చేస్తే కాకుల‌కే ఎందుకు ఆహారం పెడ‌తారు..?

July 12, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కున్ని నీటిలో ఎందుకు నిమ‌జ్జ‌నం చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 12, 2025
lifestyle

డాక్టర్లు ఎందుకు అర్థం కాకుండా ప్రిస్క్రిప్షన్ ని రాస్తారు ? అలా రాయడానికి కారణం ఇదేనా ?

July 12, 2025
వినోదం

రామ్ చరణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్…!

July 12, 2025
వినోదం

యాంకర్ అనసూయ ఎవరి కూతురో తెలుసా.. ఆమెకి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.