వినోదం

చిరంజీవి నుంచి ధనుష్ వరకు సినిమాల్లో టీచ‌ర్‌ గా నటించిన 10 మంది స్టార్స్ వీరే !

సినిమాల్లో చాలా మంది స్టార్లు టీచ‌ర్లు, లెక్చ‌రర్లుగా న‌టించ‌డం మ‌నం చూశాం. ఆయా పాత్ర‌ల్లో వారు అద‌ర‌గొట్టేశారు. చిన్న‌త‌నంలో అయితే టీచ‌ర్లు అంటే విద్యార్థులు భ‌య‌ప‌డిపోతారు. ఎక్క‌డ కొడ‌తారోన‌న్న భ‌యం వారిలో ఉంటుంది. అయితే అదంతా విద్యార్థుల‌ను స‌రైన దారిలో పెట్ట‌డానికే అని విద్యార్థుల‌కు అప్పుడు తెలియ‌దు. పెద్ద‌య్యాక తెలుస్తుంది. ఇదే నేప‌థ్యాన్ని క‌థ‌లుగా తీసుకుని ఎంతో మంది హీరోలు టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్లుగా యాక్ట్ చేసి మెప్పించారు. ఈ క్ర‌మంలోనే అలా న‌టించిన స్టార్స్ ఎవ‌రో ఇప్పుడు ఒక్క లుక్కేద్దాం.

మాస్ కి పెట్టింది పేరు అయిన చిరంజీవి, కళ్ళద్దాలు పెట్టుకుని డిఫరెంట్ లుక్ లో మాస్టర్ రాజ్ కుమార్ క్యారెక్టర్ లో అదరగొట్టేసారు. బాలకృష్ణ క్లాస్ గా కనిపిస్తూ, తప్పుదోవ పడుతున్న స్టూడెంట్స్ ని సరిచేయడానికి మాస్ పద్ధతిని వాడే శ్రీమన్నారాయణ అనే లెక్చరర్ పాత్రలో ఇరగదీసారు. వెంకటేష్ కెరియర్ లో సుందరకాండ స్పెషల్ మూవీ. లెక్చరర్ తో స్టూడెంట్ ప్రేమాయణం తర్వాత జరిగే పరిణామాలు ఆకట్టుకుంటాయి. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, జగపతిబాబుని మూడు ముక్కలాటలో లెక్చరర్ గా చూపించారు.

these actcors acted as teachers in movies

మాస్ మహారాజ రవితేజ మిరపకాయ్ మూవీలో లెక్చరర్ గా చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతగోవిందంలో కాసేపు లెక్చరర్ గా కనిపించాడు. కమల్ హాసన్ హిస్టరీ ప్రొఫెసర్ గా నటించిన తమిళ్ ఫిలిం నమ్మవర్. మమ్ముట్టి పలు చిత్రాల్లో టీచర్ పాత్రలు చేశారు. అనుబంధం, మాస్టర్ పీస్ వంటి సినిమాల్లో పాఠాలు చెప్పారు. మోహన్ లాల్ కూడా వెండితెర మీద విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వెలి పాడింటే పుస్తకం సినిమాలో ఆయన ప్రొఫెసర్ గా కనిపించారు. ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన సినిమా సార్. ఇందులో సార్‌గా ధ‌నుష్ అద‌ర‌గొట్టేశారు.

Admin

Recent Posts