వినోదం

Tollywood Actors : విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. సూపర్ సక్సెస్ అయిన టాలీవుడ్ టాప్ హీరోస్ వీళ్ళే..!

Tollywood Actors : సినిమాకు హీరో ఎంత ముఖ్యమో, విలన్ కూడా అంతే ముఖ్యం. ఇంకా చెప్పాలి అంటే.. విలన్ లేకుండా హీరోనే లేడు. విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోని అంత ఎక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుంది. విలన్ పాత్రలు కొంతమంది కెరీర్ గ్రాఫ్ నే మార్చేసాయి. మొద‌ట సినిమాల్లో హీరోగా న‌టించి ఆ త‌ర‌వాత విల‌న్ పాత్ర‌లు చేసేవారు చాలామంది ఉంటారు. కానీ మొద‌ట విల‌న్ గా న‌టించి ఆ త‌ర‌వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు మాత్రం అతిత‌క్కువ మంది ఉంటారు.

ఇక టాలీవుడ్ లో అలా కొంత‌మంది హీరోలు మొద‌ట విల‌న్ పాత్ర‌లు వేసి మెప్పించారు. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగా ఆయనకున్న అభిమానులకు కొదవే లేదు. ఆయన మాటలు, మేనరిజం, డాన్స్ అన్నీ వేరే లెవెల్ లో ఉంటాయి. అలాంటిది చిరు కూడా ఒకప్పుడు ఇది కథ కాదు, మోసగాడు, న్యాయం కావాలి వంటి చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేశారు. మోహన్ బాబు: కలెక్షన్ మోహన్ బాబు కొదమ సింహం, సర్ధార్ పాపరాయుడు, అడవి దొంగ చిత్రాల్లో నెగటివ్ పాత్రల్లో నటించారు.

these actors first did villain roles in movies

జేడీ చక్రవర్తి: గులాబీ, ప్రేమకు వేళాయరా వంటి సినిమాల్లో లవర్ బాయ్ గా కనిపించే జేడీ కూడా శివ, జోష్ వంటి చిత్రాల్లో విలన్ క్యారెక్టర్ లో చేసాడు. గోపీచంద్: మ్యాచో మ్యాన్ గోపిచంద్ తొలివ‌ల‌పు సినిమాలో హీరోగా న‌టించాడు. ఆ సినిమా అనుకున్న మేర స‌క్సెస్ అవ్వ‌లేదు. కానీ నిజం, వర్షం, జయం సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను సైతం భయపెట్టే రేంజ్ లో నటించాడు. రాజ‌శేఖ‌ర్: హీరో రాజ‌శేఖ‌ర్ కూడా కెరీర్ మొద‌ట్లో తలంబ్రాలు సినిమాలో విల‌న్ గా న‌టించాడు. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌కు నంది అవార్డును సైతం అందుకున్నాడు. ఆ త‌ర‌వాత హీరోగా స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.

Admin

Recent Posts