సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి. ఇండస్ట్రీలో ఎదగాలి అంటే టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి అని అంతా అంటుంటారు. అందుకే తమ సినిమాల విషయంలో హీరోయిన్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటూ కొంతకాలం పాటు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ అనంతరం ఫేడౌట్ అవుతారు. ఇలా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఓ సెంటిమెంట్ రన్ అవుతుందట. అది కూడా హీరోయిన్ల విషయంలో. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు అడ్రస్ లేరు అని, కొంతమంది హీరోయిన్లు అయితే మొదటి సినిమాకే దుకాణం సర్దేశారనేది టాక్. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
దేవయాని.. 1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ సుస్వాగతం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో నటించిన దేవయాని ఆ తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితం అయింది. ప్రీతి జింగానియా.. సూపర్ హిట్ సినిమా తమ్ముడు లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ప్రీతి జింగానియా ఆ తర్వాత నరసింహనాయుడు, అధిపతి వంటి చిత్రాలలో నటించి ప్యాకప్ చెప్పేసింది. సుప్రియ యార్లగడ్డ.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుప్రియ గూడచారి మూవీలో కీలకపాత్ర పోషించింది.
కీర్తి రెడ్డి.. హీరో సుమంత్ మాజీ భార్య కీర్తి రెడ్డి. తొలిప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన ఈమె అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోను నటించలేదు. అదితి గోవిత్రికర్.. తమ్ముడు చిత్రంలో లవ్లీ గా బాగా ఫేమస్ అయిన అదితి ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఆమె నటించలేదు. రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలోను నటించలేదు. నేహా ఒబెరాయ్.. బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన నేహా ఓబేరాయ్ ఆ తర్వాత జగపతి బాబుతో ఓ సినిమాలో నటించింది. ఇక ఆమె కూడా ప్యాకప్ చెప్పేసింది.
మీరా చోప్రా.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా ఆ తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితం అయింది. నికిషా పటేల్.. కొమరం పులి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో ఓమ్ 3d లో నటించింది. ఆ తర్వాత ఈమె కూడా ప్యాకప్ చెప్పేసింది.సారా జెన్ డియాస్.. పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు.