టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. వాటి పైనే ఆ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనే విషయాన్ని అంచనా వేయగలం. వీక్ డేస్, ఎలాగూ వర్కింగ్ డేస్ కాబట్టి కలెక్షన్లు తగ్గుతాయి. మళ్లీ వీకెండ్ వచ్చేవరకు అవి పికప్ అవ్వవు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే, పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకి కొన్ని అడ్వాంటేజ్ లు ఉన్నాయి. ఈ సినిమాలకి బిజినెస్ పెద్ద సినిమాల లాగా భారీ స్థాయిలో జరగదు. అయితే మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాల లిస్టు కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 మేజర్.. మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.18 కోట్లకు అమ్ముడు పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.27.76 కోట్ల షేర్ (రూ.50.30 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా రూ.9 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది. #2 విక్రమ్.. విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.7.50 కోట్లను రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది. ఈ సినిమా తెలుగులో రూ.12.53 కోట్ల షేర్ రాబట్టింది. #3 డీ జే టిల్లు.. డీ జే టిల్లు రూ.9 కోట్ల బడ్జెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 9.2 కోట్ల షేర్ రాబట్టి హిట్ గా నిలిచింది. 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి హిట్ గా నిలిచింది.
#4 జాతి రత్నాలు.. జాతి రత్నాలు రూ.10.08 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్ తో బరిలో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసే వరకు రూ. 14 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ లిస్టులో చేరింది. #5 ఉప్పెన.. ఉప్పెన రూ. 20 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసే వరకు రూ. 25 కోట్లు రాబట్టి హిట్ లిస్టులో చేరింది. #6 మాస్టర్.. మాస్టర్ తెలుగులో రూ. 8 కోట్ల టార్గెట్ తో బరిలో దిగి వీకెండ్ ముగిసే వరకు రూ. 10 కోట్ల షేర్ రాబట్టి హిట్ లిస్టులో చేరింది. #7 టాక్సీవాలా.. టాక్సీవాలా రూ.7 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ వీకెండ్ ముగిసే వరకు రూ. 9 కోట్ల షేర్ రాబట్టి హిట్ అనిపించుకుంది.