అత్యంత ఖరీదైన బంగ్లా ముగ్గురు హీరోల కెరీర్‌ని నాశనం చేసిందంటే ఎవరు నమ్మకపోవచ్చు. కాని అది నిజంగానే జరిగింది. ఇంతకీ ఆ బంగ్లా ఏంటి, ఆ ముగ్గురు హీరోలు ఎవరు అనేది చూద్దాం. ముంబైలోని కార్టర్ రోడ్డు ప్రాంతంలో సముద్రానికి కొద్ది దూరంలోనే బంగ్లా ఉంది. ముందు దీనిని 1950ల్లో భరత్ భూషణ్ అనే హిందీ నటుడు కొనుగోలు చేసారు. భరత్ భూషణ్ అప్పట్లో మంచి పేరున్న నటుడు. ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన ఎప్పుడైతే ఈ బంగ్లాను కొనుగోలు చేసారో అప్పటి నుంచి అసలు భరత్ పేరే ఇండస్ట్రీలో వినిపించకుండాపోయింది.ఈ ఇంట్లోకి వెళ్లిన తర్వాత భరత్ అప్పులపాలయ్యారట.
ఇక ఆ తర్వాత 1960ల్లో రాజేంద్ర కుమార్ అనే మరో నటుడు ఈ బంగ్లాని కొనుగోలు చేసారు. ఆయన ఈ ఇంటిని కొనుగోలు చేయకముందు వరకు మంచి పేరున్న నటుడు. ఎప్పుడైతే ఈ బంగ్లా కొనుగోలు చేసారో కొన్నాళ్లకే అప్పుల బాధలతో బంగ్లాను అమ్మకానికి పెట్టారు. దాంతో ఈ బంగ్లాను రాజేష్ ఖన్నా కొనుగోలు చేసారు.1970ల్లో రాజేష్ ఖన్నా ఈ బంగ్లాను కొనుగోలు చేసారట. ఆయన కొన్నాక ఈ బంగ్లాకు ఆశీర్వాద్ అనే పేరు పెట్టారు. ఈ ఇంట్లోకి కుటుంబంతో సహా అడుగుపెట్టిన రాజేష్ ఖన్నాకి ఉన్నట్టుండి సినిమాలు లేకపోవడం.. కుటుంబంలో కలహాలు రావడం జరిగాయి.
ఆయన భార్య డింపుల్ కపాడియా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. చివరి రోజుల్లో రాజేష్ ఖన్నా ఇదే బంగ్లాలో ఒంటరిగా ఉంటూ చనిపోయారని చెప్తుంటారు. ఆ తర్వాత ఈ బంగ్లాను మరో వ్యక్తి కొనుగోలు చేసి సగం భాగం కూల్చి వేయించారు. కాస్త కొత్తగా కట్టించి.. పాత జ్ఞాపకాలు ఏవీ కనిపించకుండా కొత్త రూపు తెచ్చారు. రాజేష్ ఖన్నా ఈ బంగ్లాను కొనుగోలు చేసినప్పుడు, అతను కూడా రాజేంద్ర కుమార్ లాగా మంచి పొజీషన్‌లో ఉండేవాడు. రాను రాను పరిస్థితులు పూర్తిగా మారాడు. రాజేష్ ఖన్నా ఆరాధన్, దో రాస్తే, కటి పతంగ్, ఆనంద్, బావర్చి, ప్రేమ్ నగర్, అమర్ దీప్ మరియు మరెన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అలరించాడు.