వినోదం

Chiranjeevi : చిరంజీవిని సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా మ‌ధ్య‌లోనే తీసేశారా..?

Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో అంటే ఎన్టీఆర్ అని చెప్పాలి . తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు అన్నగారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఎవరైనా కాలంతో పాటు నడుస్తారు. కానీ, టైమ్‌ను తన వెంట నడిపించుకున్న కథానాయకుడు యన్టీఆర్ అని చెప్పాలి. ఇక తెలుగునాట హిందీ రీమేక్‌ మూవీస్‌‌కు అప్పట్లోనే ఓ స్పెషల్‌ క్రేజ్‌ తీసుకు వచ్చిందీ అన్న‌గారు అని చెప్పాలి. ఆయన తన 52వ ఏట ‌ ‘నిప్పులాంటి మనిషి’ రీమేక్‌ లో నటించగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

ఎన్టీఆర్ సోలో హీరోగా కాకుండా ప‌లు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు కూడా చేశాడు. చిరంజీవితో క‌లిసి ప‌లు చిత్రాలు చేశాడు. తిరుగులేని మ‌నిషి చిత్రంలో న్యాయ‌వాది రాజాగా ఎన్టీఆర్, క్ల‌బ్‌లో పాట‌లు పాడే కిషోర్‌గా చిరంజీవి న‌టించారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది.అయితే ఓ సారి చిరంజీవిని ఎన్టీఆర్ సినిమా మ‌ధ్య‌లో నుండే తీసేసార‌ట‌. ఎన్టీఆర్ న‌టించిన సినిమాల్లో కొండ‌వీటి సింహం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ చిత్రం 1981 అక్టోబ‌ర్ 07న విడుద‌లైంది.

this is the reason why chiranjeevi removed from sr ntr movie

కొండ‌వీటి సింహం చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు మోహ‌న్ బాబు కూడా న‌టించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. మోహ‌న్ బాబు పాత్ర‌కు తొలుత చిరంజీవిని అనుకోగా, కానీ ఆయ‌న స‌రిగ్గా చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఆ ఛాన్స్ మోహ‌న్ బాబుకి ద‌క్కింది. ఈ సినిమాలో కీల‌క పాత్ర కోసం చిరంజీవిని ఎంపిక చేసి అత‌నిపై 5 రోజుల పాటు షూటింగ్ కూడా చేశార‌ట‌. కానీ ఆయ‌న ఎన్టీఆర్‌కి ఎదురు తిరిగి డైలాగ్‌లు చెప్ప‌డంలో ఇబ్బంది ప‌డ్డార‌ట‌. ఎన్టీఆర్ ఆ సినిమా కోసం కేవ‌లం నెల రోజులు మాత్ర‌మే డేట్స్ ఇవ్వ‌డంతో చిరంజీవితో సినిమా షూట్ చేస్తే ఆల‌స్య‌మ‌వుతుంద‌ని మోహ‌న్ బాబుని తీసుకున్నార‌ట‌. అలా చిరంజీవి.. ఎన్టీఆర్ సినిమా నుండి తొల‌గించ‌బ‌డ్డాడు.

Admin

Recent Posts