Jr NTR : నందమూరి తారకరామారావు రేంజ్‌లో ఆ ఫ్యామిలీ పేరు ప్రఖ్యాతలు పెంపొదింపజేసిన హీరోలలో బాలకృష్ణ, ఎన్టీఆర్ తప్పక ఉంటారు. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నా కూడా ఆయన కన్నా ఎక్కువ క్రేజ్ దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇంతటి స్టార్డం తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.. చాలా సంవత్సరాల వరకు ఫ్యామిలీ సపోర్ట్ దొరకలేదు. అయినా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా కష్టపడుతూ ముందుకు వెళ్లి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు.
అయితే ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుందని టాక్. ఒకానొక సమయంలో బాలకృష్ణ ఇండైరెక్టుగా ఎన్టీఆర్ ను కూడా తిట్టడం ,ఒక సీనియర్ జర్నలిస్టు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ కావాలనే అవమానిస్తున్నారని రాసుకొచ్చారు. అయితే ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, బాలకృష్ణ వారిద్దరినీ బయటకు వెళ్ళమని చెప్పారని. ఆ అవమానాన్ని తట్టుకోలేక జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయి అది దృష్టిలో పెట్టుకొని చాలా కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారని చెబుతారు.
ఎన్టీఆర్‌కి ఎప్పుడైతే స్టార్‌డం వచ్చిందో అప్పటి నుండి బాలకృష్ణ.. జూనియర్‌ని దగ్గరకు తీయడం మొదలు పెట్టడం చేశారని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం ఎన్టీఆర్ కి బాలకృష్ణ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ విధంగా ఏదోరకంగా ఎన్టీఆర్ ను తన బాబాయి దూరం పెడుతూ వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నా కూడా నందమూరి అభిమానుల మాత్రం వీటిని కొట్టి పడేస్తున్నారు.