తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతమున్న స్టార్ సీనియర్ హీరోల్లో చిరంజీవి, వెంకటేష్ మంచి స్నేహితులు. చిత్ర పరిశ్రమలో చిరంజీవి మాస్ హీరోగా ఉన్నాడు. ఇక వెంకటేష్ క్లాస్, మాస్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నాడు. ఈ తరుణంలోనే చిరంజీవి మాస్ సినిమాలకి పెట్టింది పేరు. అప్పట్లో ఆయన సినిమాలు వస్తున్నాయంటే రికార్డు క్రియేట్ చేసేవి.
ఈ విధంగా చిరంజీవి నుంచి అన్నీ మాస్ సినిమాలు ఒక టైం లో అన్ని రొటీన్ స్టోరీలు వస్తున్నాయని అల్లు అరవింద్ సలహా మేరకు చిరంజీవి కూడా ఫ్యామిలీ తరహా చిత్రాలు చేశారు. ఆ విధంగా చిరంజీవి ఫ్యామిలీ చిత్రం డాడీ.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పటికీ టీవీలో వస్తే కళ్ళు తిప్పుకోకుండా చూస్తారు అభిమానులు. దీంతో చిరంజీవి తన సన్నిహితుల వద్ద ఏ హీరో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో అభిమానులకు బాగా తెలుసు అని, నాకు ఫ్యామిలీ సినిమాలు సెట్ కావని చెప్పారట.
ఇవి కేవలం వెంకటేష్ కి మాత్రమే సెట్ అవుతాయని అన్నారట. ఫ్యామిలీ సినిమాలు అంటే వెంకటేష్ కు కచ్చితంగా సూట్ అవుతాయని తెలియజేశారు.