వినోదం

పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై స్పందించిన చిరు.. ఏమన్నారో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్థులు విమర్శలు చేయడం కామన్. అయితే పవన్ పై చాలా మంది ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్ల గురించే విమర్శ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో ఈ పెళ్లిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు. ఆయన పెళ్లిళ్ల విషయం తప్ప మరి ఏ అవినీతి ఆయన చేయలేదు.

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని వైసిపి తిట్టాలి అంటే కేవలం పెళ్లి గురించి మాత్రమే విమర్శిస్తారు. ఇంకా ఏ కారణాలు దొరకవు. ఈ మధ్యకాలంలో పెళ్లి గురించి ఆరోపణలు రావడంతో నేను పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల మీకేం నష్టం వచ్చింది కావాలంటే మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోమని పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ తరుణంలోని పవన్ పెళ్లిల విషయంపై చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ మీద వేసే విమర్శలపై మీ స్పందన ఏంటని యాంకర్ చిరంజీవిని అడగగా ..

what chiranjeevi said about pawan kalyan 3 marriages

నేను రాజకీయాల విమర్శల గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు. నాకు పవన్ కళ్యాణ్ బిడ్డలాంటోడు. పాలిటిక్స్ అనేది తన వ్యక్తిగత విషయం. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయం ఆయన వ్యక్తిగత విషయమని తెలియజేశారు. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Admin

Recent Posts