తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నూతన ప్రసాద్ అంటే తెలియనివారుండరు..ఆయన చేసిన చాలా చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
అయితే ఆయన సినిమాలు చేస్తున్న సమయంలోనే ఒక అనుకోని ఘోర సంఘటన జరిగి తన సీని కెరియర్ నాశనమైంది. జరిగింది ఏంటయ్యా అంటే..
1989 రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన బామ్మ మాట బంగారు బాట అనే మూవీ షూటింగ్ సందర్భంలో ఒక అనుకోని సంఘటన జరిగడంతో ఆయన సినీ జీవితం పూర్తిగా అంధకారం లోకి వెళ్ళింది. దీని తర్వాత నూతన్ ప్రసాద్ వీల్ చైర్ కి పరిమితం అయ్యారు. సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక జెసిబి కార్ ని పైకి ఎక్కే సన్నివేశం ఉంది. కానీ అనుకోకుండా జెసిబి చైన్ తెగిపో వడంతో పై నుంచి ఒక్కసారిగా కారు తో సహా నూతన్ ప్రసాద్ కిందపడిపోయారు.
దీంతో ఆయన వెన్నుముక విరిగి వీల్ చైర్ కి పరిమితం అయ్యారు. ఈ తరుణం లోనే ఆయనకు పక్షవాతం కూడా వచ్చి మరింత చతికిల పడి పోయారు. దీంతో సినిమా లకు దూరమై పోయారు. ఇంత అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నూతన్ ప్రసాద్ సినీ జీవితం మధ్యలోనే ఆగిపోవడంతో ఎంతోమంది అభిమానులు ఆ వేదన వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ ఘట నకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.