రాజమండ్రి కి చెందిన దేవి, టీవీ9 లో బ్రేకింగ్ న్యూస్ కి మారుపేరు. స్టైలిష్ గా వార్తలు చదవడమే కాకుండా, ఆమె హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ అంతా విచిత్రంగా ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ అంతే సీరియస్ గా ఉంటూ, చివరలో ఎలిమినేట్ అయింది. అయితే దేవీ నాగవల్లి, దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి రిలేటివ్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవల దేవి తల్లి గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ, దాసరి తమకు చుట్టమే అని, బంధువులంతా శుభకార్యాల్లో కలుస్తుంటామని, కానీ ఎక్కడ ఆయన పేరు వాడుకోలేదని చెప్పారు. దాసరి, దేవి తల్లి గారి అత్తగారి తమ్ముడు, దేవి తండ్రి, దాసరికి మేనల్లుడు అవుతారు.
అలా దేవి, దాసరి గారికి మనవరాలు అవుతారని ఆమె తల్లి చెప్పారు. రాజమండ్రిలో పుట్టి బీకాం చదువుకున్న దేవి, గ్రాఫిక్స్ కోర్సు చేసి టీవీ9 ఛానల్ లో చేరారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని అమెరికా వెళ్లిన ఆమె, అక్కడ ఎనిమిది నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేక విడాకులు తీసుకున్నారు. దేవికి బాబు ఉన్నాడు.