వినోదం

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సంఘ‌ట‌న నిజంగా జ‌రిగిందా..? లేదా అంతా నాట‌క‌మా..?

సినిమా ఇండ‌స్ట్రీలో ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగింది అంటే స‌హ‌జంగానే ప్ర‌జ‌ల దృష్టి మొత్తం వారి మీదే ఉంటుంది. మొన్నా మ‌ధ్య సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాక చోటు చేసుకున్న సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. మొత్తం అల్లు అర్జున్ పైనే మీడియా ఫోక‌స్ పెట్టింది. ఇక ఇటీవ‌లే బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా ఓ సంఘ‌ట‌న జ‌రిగ్గా మీడియా ఫోక‌స్ మొత్తం ఆయ‌న‌పైకే వ‌చ్చింది. ప్ర‌జ‌లు కూడా అస‌లు ఏం జ‌రిగింది.. అని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపారు. అయితే అస‌లు సైఫ్ ఇంట్లో జ‌రిగింది నిజంగానే సంఘ‌ట‌నేనా. లేక కావాల‌నే అంతా నాట‌కం ఆడారా.. అంటే అందుకు రెండో స‌మాధాన‌మే జ‌వాబుగా వినిపిస్తోంది.

మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల ప్ర‌కారం సైఫ్ అలీ ఖాన్‌కు మొత్తం ఆరు క‌త్తిపోట్లు ప‌డ్డాయి. వాటిల్లో రెండు పోట్లు మాత్రం వెన్నెముక‌కు మ‌రీ ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాయ‌ట‌. దీంతో వైద్యుల‌కు స‌ర్జ‌రీ చేసేందుకు సుమారుగా 5 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. అయితే అంతా బాగానే ఉంది కానీ ఇలాంటి క‌త్తిపోట్ల‌కు గురైన వారు సాధార‌ణంగా కోలుకోవ‌డానికి కొన్ని వారాలు లేదా నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. కానీ సైఫ్ మాత్రం 5 రోజుల్లోనే బ‌య‌ట‌కు రావ‌డం అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది వైద్యులు సైతం ఇదే సంఘ‌ట‌న‌పై స్పందించారు కూడా. అంత‌టి తీవ్ర గాయాలు అయిన వారు కోలుకునేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు. క‌నుక సైఫ్‌కు తాకిన‌వి చిన్న గాయాలే అని స్ప‌ష్ట‌మ‌వుతుంది. మ‌రి మీడియాలో అలాంటి క‌థ‌నాలు ఎందుకు వ‌చ్చాయి అన్న దానిపై స్ప‌ష్ట‌త లేదు.

what really happened in saif ali khan home

ఇక సైఫ్ ఇంట్లోకి చొర‌బ‌డిన ఆగంత‌కుడిని ప‌ట్టుకున్నాం అంటూ ఒక వ్య‌క్తిని అరెస్టు చేశారు. కానీ సీసీకెమెరాల దృశ్యాల‌ను బ‌ట్టి చూస్తే సైఫ్ ఇంట్లోకి వ‌చ్చింది అత‌ను కాద‌ని స్ప‌ష్ట‌మైంది. దీంతో ఆ వ్య‌క్తిని వ‌దిలేశారు. అయితే పాపం ఈ సంఘ‌ట‌న వ‌ల్ల స‌ద‌రు వ్య‌క్తి త‌న జాబ్ కోల్పోవ‌డ‌మే కాక త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న త‌న పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఎక్క‌డా త‌న‌కు ఉద్యోగం ఇవ్వ‌డం లేద‌ని కూడా వాపోయాడు. అయితే సైఫ్ ఇంట్లో జ‌రిగిందంతా వారు చెబుతున్న‌ట్లు నిజ‌మే అయితే నిందితుల‌ను క‌చ్చితంగా ప‌ట్టుకోవాల్సిందే. అందులో ఏ అనుమాన‌మూ లేదు. కానీ అబ‌ద్దం అయితే మాత్రం.. ఈ డ్రామా అంతా ఎందుకు ఆడిన‌ట్లు అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావ‌ల్సి ఉంది. ఏది ఏమైనా సినిమా వాళ్ల ఇళ్ల‌లో జ‌రిగే విష‌యాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. అవి బ‌య‌ట‌కు రావు, ఒక‌వేళ వ‌చ్చినా జ‌నాలు అప్ప‌టికి మ‌రిచిపోతారు, వారికి ఏం జ‌రిగింది అన్న‌ది గుర్తు ఉండ‌దు.

Admin

Recent Posts