వినోదం

ఫైట్ స‌న్నివేశాల్లో కొన్ని సార్లు న‌టీన‌టుల‌ను నిజంగానే కొడ‌తారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను కోడైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఓ సినిమాలో ఓ సీనియర్ హాస్యనటుడి పక్కన ఓ సన్నివేశంలో నటించటానికి ఓ హాస్య నటుడు అవసరమైనప్పుడు&comma; అంతకముందు ఈ&period;వీ&period;వీ&period;సత్యనారాయణ గారి ఒకట్రెండు సినిమాలలో నటించిన నాకిష్టమైన వర్ధమాన నటుడు గుర్తుకొచ్చారు&period; ఆయన ఆంధ్ర లో ఉద్యోగం చేస్తుంటారని తెలుసుకొని ఫోన్ చేసి పిలిపించాము&period; అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లోని స్ట్రీట్ సెట్ లో షూటింగ్&period; 300 అడుగుల నిడివిని దాటివుండే ఆ సన్నివేశాన్ని ఒకే షాట్ లో చిత్రీకరించాలని దర్శకుడి నిర్ణయం&period; ఒక క్యాన్ లో 400 అడుగుల నెగెటివ్ మాత్రమేవుంటుంది&period;&lpar;ఇప్పటిలా డిజిటల్ కాదు&rpar; షాట్ మధ్యలో కట్ చేయవలసివస్తే మళ్ళీ మరో కొత్త క్యాన్ లోడ్ చేయవలసిందే&period; ఆ విషయం ఇద్దరు నటులకూ చెప్పి డైలాగ్ రిహార్సల్స్ చేయించారు దర్శకుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టేక్ చేస్తూ దర్శకుడు యాక్షన్ చెప్పగానే సీనియర్ నటుడు హుషారుగా అవసరం లేకున్నా వర్ధమాన నటుడిని ఎడాపెడా కొడుతూ డైలాగ్స్ చెబుతుంటే ఆ నటుడు నాలుగైదు డైలాగుల తరువాత డైలాగ్స్ తడబడి ఆగిపోతున్నారు&period; ఆ సీనియర్ ఎక్కడ్నించి తెచ్చారండీ ఇతన్ని టైమింగ్ లేదూ బొ&&num;8230&semi;&period;లేదూ&period;&period; అంటూ విసుక్కొన్నారు&period; మళ్ళీ కొత్త నెగెటివ్ క్యాన్ లోడ్ చేసి టేక్&period; మళ్ళీ సీనియర్ నటుడు రెచ్చిపోయి చేస్తుంటే మొత్తానికి అయ్యిందనిపించాడా వర్ధమాన నటుడు&period; సన్నివేశం తృప్తిగా రాకపోయినా సమయాన్ని&comma;నెగెటివ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు షాట్ ఓకే చెయ్యవలసివచ్చింది&period; తరువాత మేకప్ రూముకు వెళ్ళిన నాతో ఆ నటుడు వెరీ సారీ దేవీ గారు మీరెంతో అభిమానంతో నన్ను పిలిపిస్తే నేను బాగా నటించలేకపోయాను&period; ఆ సీనియర్ నటుడు షాట్ లో విపరీతంగా నన్ను కొడుతూ డైలాగులు చెబుతుంటే నా ఏకాగ్రత మొత్తం పోయింది సారీ అంటూ బాధపడుతుంటే ఆయన కంట్లో కన్నీటిపొర స్పష్టంగా కనిపించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86486 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;actor&period;jpg" alt&equals;"what really happens during fight scenes making " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయన షర్ట్ విప్పి వీపును చూపిస్తే షాకయ్యాను&period; చేతివేళ్ళ అచ్చులు ఎర్రగా ముద్రలు పడిపోయివున్నాయి&period; షాట్ జరుగుతున్నప్పుడే విషయం మాకు అర్ధమైందండీ బాధపడకండి అని ఓదార్చాను&period; నేనొక్కసారి కొన్నేళ్లు వెనక్కి ఫ్లాష్‌బ్యాక్‌కి వెళితే &comma;అదే సీనియర్ హాస్యనటుడు ఓరోజు భోజనాల సమయంలో&comma; తన కెరీర్ తొలి దినాలలో ఓ హీరో శాడిజంతో తనతో ఆడుకొని తన ఆత్మ స్థైర్యాన్ని ఎలా దెబ్బతీశాడో చెబుతూ బాధపడిన సందర్భం గుర్తుకొచ్చింది&period; జరిగింది నిర్మాత గారికి చెబితే ఆయన ఆ సీన్ మళ్ళీ రీషూట్ చెయ్యండి ఫరవాలేదన్నారు&period; మళ్ళీ ఓరోజు షూట్ పెట్టి ఆ వర్ధమాన నటుడికే కాల్ చేస్తే ఆయన ఎందుకొచ్చిన తంటా అనుకొన్నారో ఏమో నాకు సెలవు దొరకట్లేదండి అని చెప్పేశారు&period; ఆస్థానంలో మరొక రెగ్యులర్ కమెడియన్ ని పెట్టి రీషూట్ ప్రారంభించాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సారి దర్శకుడు ఆ సీనియర్ నటునికి ఎందుకు రీషూట్ చేయవలసివచ్చిందో చెప్పి పక్క ఆర్టిస్ట్‌ని వెకిలిగా ఒక్క దెబ్బకూడా వేయటానికి వీల్లేదుఅని చెబుతూ&comma; పక్క ఆర్టిస్ట్ తో ఒకవేళ ఆయనగనక నిన్ను కొడుతూ డైలాగ్స్ చెబితే నువ్వుకూడా ఆయనకి రెండు తగిలించి డైలాగ్స్ చెప్పు అన్నారు నవ్వుతూనే&period; అవాక్కయిన ఆ సీనియర్ కొంతసేపటికి తేరుకున్నాక&comma; స్వతహాగా అద్భుతమైన నటుడుగనుక సింగిల్ షాట్‌లో అద్భుతంగా నటించారు&period; చెప్పొచ్చేదేమిటంటే&&num;8230&semi;&period; కళాకారులు&comma; రచయితలు అందరూ సున్నితమనస్కులై ఉంటారు అని తరచూ చెప్పే మాట కొందరి విషయంలో మాత్రమే నిజం&period; వాళ్ళూ మామూలు మనుషులే&period; ఈర్ష్య అసూయ ద్వేషాలు వాళ్ళకీ కామనే&period; సకల కళలన్నిటినీ మించిన కళ ఒకటుంది&period; స్థాయీ బేధాలు&comma; కుల&comma; మత&comma; ప్రాంతీయ బేధాలేవీ పరిగణించక సాటి మనిషిని మనిషిగా చూసే కళ అది&period; ఆ కళ పేరు మానవత్వం&period; అతి తక్కువమంది మనుషులకు మాత్రమే అబ్బే అరుదైన కళ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8212&semi; దేవీ ప్రసాద్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts