నేను చిరంజీవి మొదటి సినిమా సుదర్శన్70mmలో మొదటి ఆట చూడ్డానికి వెళ్లినప్పుడే కొత్త నటుడు అని పేపర్ లో ad చూసే వెళ్లాను, ఒక యుగళగీతాన్ని ఇష్టపడ్డాను. చిరంజీవి క్రమంగా చిత్ర చిత్రానికి ఎదుగుతూ వచ్చారు. పున్నమి నాగులో మంచి గుర్తింపు, కోతలరాయుడులో మంచి మార్కులు కొట్టేసాడు. నాకు గుర్తు మా ఇంటి దగ్గరనే మా ఫ్రెండ్ ఇంటిలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ షూటింగ్ విరామ సమయంలో హీరోయిన్ అస్సలు తనతో మాట్లాడేది కాదు, తను ఒక ప్రక్కన కూచొని ఉండేవాడు , మేము కూడా అంతలా పట్టించుకోలేదు. అప్పటికే పెద్ద హీరోయిన్ మాధవితో చేయాలని చేస్తే తను హీరోగా ఒక మెట్టు ఎక్కాననే, సాధించాననే అనుకునేవాడు. విశేషమేమిటంటే shooting జరిగిన ఇల్లు- అపార్ట్‌మెంట్ గా కట్టారు , నేను అదే అపార్ట్‌మెంట్ లో అదే షూటింగ్ ఐన ఫస్ట్ ఫ్లోర్ లో చిరంజీవి సిన్మా షూటింగైంది అని కాదుగాని మా బిల్డింగ్ ప్రక్క అపార్ట్‌మెంటే కదా అని 101 నెంబరు ప్లాట్ ఇష్టపడి కొనుక్కున్నాను.
హీరోయిన్ మాధవి జంటగా ఖైదీ సినిమాను ఘన విజయంగా సాధించి పరిశ్రమలో జెండా పాతాడు. చిరంజీవి సురేష్ ప్రొడక్షన్ లో రామానాయుడు ఎప్పుడు తనతో సినిమా తీస్తే అప్పుడే నిజమైన హీరో status వస్తుంది అని భావించాడు. అది సంఘర్షణతో తీరింది, అప్పుడు చాలా సంతోష పడ్డాడు. తన వివిధ దశలలో చిరంజీవి కు ఎవరూ పోటీగా రాలేదు. నరసింహరాజు, సుమన్, రాజశేఖర్, వినోద్ కుమార్ లాంటి ఎంతో మంది ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించినా, చిరంజీవి స్థాయి, స్థానానికి కదలిక రాలేదు. ఇక అందరు అంటున్నట్లు కాక నాకు తను చిత్రసీమ లో అల్లురామలింగయ్య అల్లుడుగా లాభపడింది కన్నా లెక్కకు చూస్తే అల్లు కుటుంబమే చిరంజీవితో చాలా ఛాలా లాభపడింది అనిపిస్తుంది.
తన వివిధ దశలలో చిరంజీవి కు ఎవరూ పోటీగా రాలేదు. నేటి పరిస్థితి (లేదా దుస్థితి)ఏంటి? గత వైభవాన్ని అభిమానులకు వదిలేసి(ఇంకా నటిస్తున్నారు కాబట్టి) చిరంజీవి గారు హుందాతనాన్ని నింపుకున్న పాత్రలతో వచ్చినా యువ నటులతో ఇప్పట్లో పోటీ గెలుపు సందేహమే.