వినోదం

ఒక నటుడు తన ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన పాత్ర పోషించగా చూసి మీరు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయా? అవేమిటి?

నా ఉద్దేశ్యంలో తన ఇమేజ్ కి భిన్నమైన నటనను ప్రదర్శించడంలో బాగా ఆసక్తి చూపే నటుడు అల్లరి నరేష్. సాధారణంగా అల్లరి నరేష్ అంటే మంచి టైమింగ్ తో చెప్పే కామెడీ డైలాగులే గుర్తుకు వస్తాయి. కానీ, ఎప్పటికప్పుడు తన నటనలో వైవిధ్యాన్ని చూపించే నటనను ప్రదర్శించడంలో అతనికి బాగా ఆసక్తి. విశాఖ ఎక్స్ ప్రెస్ లో అతి క్రూరమైన విలన్ గా నటించి మెప్పించాడు. నేను అనే సినిమాలో ఇంట్రోవర్ట్ గా సైకాలాజికల్ క్యారెక్టర్‌లో మెప్పించాడు.

ప్రాణం అన్న సినిమాలో రెండు జన్మల ప్రేమికుడిగా జీవించాడు. గమ్యం సినిమాలో గాలి సీనుగా త్యాగం చేసే పాత్రలో అలరించాడు. ఈ సినిమా గురించి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. మొదట గాలిసీను పాత్రకి శర్వానంద్ ని, హీరో పాత్రకి అల్లరినరేష్ ను దర్శకుడు క్రిష్ అనుకున్నారట. కానీ నరేష్ పట్టుబట్టి సైడ్ హీరో అయినా ఫరావాలేదు, తనకి గాలిశీను పాత్రే కావాలని పట్టుబట్టారట. ఈ విధంగా వైవిధ్యంపై నరేష్ కి ఉన్న ఆసక్తి అర్ధమవుతుంది.

who is your favorite actor in different challenging roles

అయితే ఇవేవి నన్ను అంతగా ఆశ్చర్యపరచలేదుగాని, ఈ మధ్యనే వచ్చిన నాంది సినిమాలో పోలీసు బాధితుడి పాత్రలో అతని నటన న భూతో న భవిష్యతి. ఆ సినిమాలో అతని నటన నన్ను బాగా ఆశ్చర్య పరిచింది. అల్లరి నరేష్ ఇలా కూడా నటించగలడా అని అనిపించింది. అతను మరిన్ని వైవిధ్య పాత్రలలో నటించి, మెప్పించాలని ఆశిద్దాం.

Admin

Recent Posts