వినోదం

Soundarya : సౌంద‌ర్య సోద‌రుడితో జ‌ర‌గాల్సిన ఆమ‌ని పెళ్లి.. ఎందుకు ఆగింది..?

Soundarya : ఆమ‌ని.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అందం, అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది ఈ అందాల ముద్దుగుమ్మ‌. జంబలకడిపంబ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమని తరువాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, మావిచిగురు వంటి సినిమాలు తన జీవితంలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలలో ఆమని తప్ప మరే ఇతర హీరోయిన్ నటించినా అంతటి విజయాన్ని అందుకునేది కాదు అనే విధంగా ఆమని ఆ పాత్రలో నటించారు. పెళ్లయిన తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికి అంకితమై పోయిన ఆమని తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మధ్యాహ్నం హత్య అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.

ఆమ‌ని తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతోపాటు జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి హీరోల పక్కన కూడా నటించి హిట్లు కొట్టింది. అప్పట్లో ఒక సినిమాలో ఆమ‌ని ఉందంటే ఆ సినిమాకు హీరోతో సంబంధం లేకుండా మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆమని చావు క‌బురు చ‌ల్ల‌గా అనే సినిమాలో అల‌రించింది. ఆ సినిమానే కాకుండా ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌లోనూ న‌టిస్తోంది. అలాగే ప‌లు ప్ర‌ముఖ‌ టీవీ షోల‌లో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే ఆమ‌ని.. సౌంద‌ర్య సోద‌రుడిని వివాహం చేసుకోవాల‌ని ఓ సంద‌ర్బంలో భావించింద‌ట‌.

why amani said no to soundarya brother

అప్పట్లో సౌందర్య, ఆమని మధ్య ఎంతో స్నేహబంధం ఉండేది. సౌందర్యతో మాత్రమే కాకుండా, తన కుటుంబంతో కూడా ఆమనికి ఎంతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒకరోజు సౌందర్యతో కలిసి వారి ఇంటికి వెళ్ళినప్పుడు సౌందర్య తండ్రి మా అబ్బాయి అమ‌ర్‌ని పెళ్లి చేసుకుంటావా అని అడిగార‌ట‌. ఉన్నఫలంగా సౌందర్య తండ్రి ఆ విధంగా అడగడంతో అప్పుడు ఏదో ఒక విధంగా మేనేజ్ చేశాము. అయితే ఆ రోజు మాతో పాటు తెలంగాణ శకుంతల కూడా అక్కడ ఉన్నారు.

సౌందర్య నాన్నకి తెలియని విషయం ఏమిటంటే.. అమర్ కి కాలేజ్ లో ఒక అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉందనే విషయం తెలియక.. అమర్ ని పెళ్లి చేసుకోమని నన్ను అడిగారని అసలు కారణం ఆమని తెలిపారు. అయితే కొద్ది రోజుల తర్వాత సౌందర్య తండ్రి మరణించిన తర్వాత అమర్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ సౌందర్య, తన సోదరుడు అమర్ ఇద్దరూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

Admin

Recent Posts