ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో హోదాలో కొనసాగిన రాజశేఖర్ ప్రస్తుతం కాస్త చతికిల పడ్డారు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.
ఆయన నటించిన సినిమాల్లో సింహరాశి సినిమా మాత్రం ఎప్పటికీ అందరికీ గుర్తిండిపోయే మూవీ గా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరి ఆ విషయాలు ఏంటో మనం ఓ లుక్కేద్దాం.. అయితే సింహరాశి సినిమా ను హీరో రాజశేఖర్ కంటే ముందుగా బాలయ్య దగ్గరికి వచ్చిందట. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. దీనికి ప్రధాన కారణం అప్పట్లో బాలకృష్ణ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి యాక్షన్ సినిమాలు తీసి హిట్లు కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. తర్వాత కూడా అలాంటి సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్న క్రమంలో సింహరాశి కథను దర్శకుడు వి.సముద్ర బాలయ్యకు వినిపించారట.
ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ లాంటి బ్యాక్ డ్రాప్ కథ ఉండడంతో అప్పుడే ఫ్యాక్షన్ సినిమాలతో ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపుతున్న బాలయ్యకు ఈ కథ సెట్ కాదని,ఆయన రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో వి.సముద్ర ఈ కథను రాజశేఖర్ కి వినిపించారు. ఆయనకు నచ్చిందని సినిమా కి ఓకే చెప్పారట. షూటింగ్ ప్రారంభమై తల్లి సెంటిమెంట్ ను బాగా రక్తి కట్టించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. కానీ అదే సమయంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి మాత్రం ఫ్లాప్ అయ్యింది.