వినోదం

దర్శకుడు శంకర్ ఇంతకుముందులా సినిమాలు ఎందుకు తియ్యలేక పోతున్నారు?

శంకర్ ఇప్పటివరకూ 15 సినిమాలకి దర్శకత్వం వహించాడు. వీటిలో ఏకంగా 11 సినిమాలు ఇండస్ట్రీ హిట్ / బ్లాక్ బస్టర్ / సూపర్ హిట్ గా నిలిచాయి. ఇది గొప్ప రికార్డే – సందేహం లేదు. ఆయన ఫ్లాప్స్ లో నాయక్ (హిందీ), బాయ్స్, ఇండియన్2 తో పాటు ఈ మధ్యే విడుదలైన గేమ్ ఛేంజర్ కూడా వుంది. ఆయన ఏ రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవలేదు. దానికి ఈ మధ్యే బ్రేక్ పడింది. ఇండియన్2, గేమ్ ఛేంజర్ లతో. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలే. విచిత్రం ఏమిటంటే, కొన్ని అసాధారణంగా బావుంటే మరికొన్ని చాలా చప్పగా, మూస ధోరణిలో – ఇది శంకర్ సినిమాయేనా అన్నట్లు వుంటాయి.

అతని ఫెయిల్యూర్స్ కి ముఖ్య కారణం అతను చేయించే విపరీత మైన ఖర్చు. చాలా లావిష్ గా తీస్తాడు. ఉదా.. గేమ్ చేంజర్ పాటలకు మాత్రమే ₹75 కోట్లు నిర్మాతల చేత ఖర్చు చేయించాడు. అంత అవసరమా? వసూళ్ళలో అంతమేర కోసుకుపోయినట్లేకదా – అదీ ఫ్లాప్ మువీకి. శంకర్ సినిమాలు ఈ మధ్యలో గొప్ప హిట్స్ కాక‌పోవ‌డానికి మరో ముఖ్య కారణం ఆ సినిమాల బలహీనమైన స్టోరీ లేదా ఇతి వృత్తం. శంకర్ తో చాలా కాలం ప్రయాణించిన స్టోరీ రైటర్ సుజాత మరణం (2008లో) తరువాత శంకర్ తీసిన కొన్ని సినిమాలు హిట్ అయినా, గొప్ప సినిమాలు కావు – వసూళ్ళ పరంగా. ఆయన తీసే సినిమాలు జాప్యం అవడం, దాని వల్ల ఖర్చు తడిసి మోపెడు అవటం ఇత్యాది ఇతరత్ర కారణాల మూలంగా రిలీజ్ డేట్లు బాగా ఆలస్యం అవటం మామూలే.

why director shankar movies are flopping

అయితే బలమైన కథ, కథనం, చిత్రీకరణ, ఖర్చుపై నియంత్రణ వుంటే అట్టర్ ఫ్లాప్ లు కాకపోడానికి అవకాశం వుంటుంది. వయస్సు పెరగటం, చిత్రీకరణ పరిస్తితులలో మార్పులు, ప్రస్తుత సినీరుచులకు తగ్గట్లు తీయలేక పోవటం, యువతను మెప్పించలేక పోవటం ఇతర కారణాలు. ముందున్నట్లు కాన్ఫిడెన్స్ లోపించడం వల్ల కలిగిన సందిగ్ధంలో తీసినవి భారతీయుడు-2, గేమ్ ఛేంజర్. ఆయనకు గొప్ప ప్లాష్ బ్యాక్ వుంది మంచి డైరెక్టర్ గా. వసూళ్ళలో చక్కటి రికార్డ్ కూడా వుంది. మరి ఆ అద్వితీయ ప్రసహనం కొనసాగుతుందా అంటే ఏమో! దర్శక మేధావి కాబట్టి అవుననవచ్చు.

Admin

Recent Posts