ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ వాడకం అన్ని రంగాల్లోనూ బాగా పెరిగిపోయింది. దీంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే గతంలో కన్నా ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి కనుక సినిమాల్లో గ్రాఫిక్స్ అద్భుతంగా వస్తున్నాయి. అయితే సినిమాల్లో గ్రాఫిక్స్ కోసం సాధారణంగా ఎవరైనా సరే గ్రీన్ కలర్ మ్యాట్‌లనే ఎక్కువగా వాడుతారు. కేవలం ఈ రంగు మ్యాట్‌నే గ్రాఫిక్స్ కు ఎందుకు వాడుతారో తెలుసా..? ఇదే ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ కలర్ అనేది మనిషి చర్మం, జుట్టు కలర్లకు సంబంధం లేకుండా ఉంటుంది. అందువల్ల ఈ కలర్‌కు చెందిన మ్యాట్‌లనే గ్రాఫిక్స్ కోసం వాడుతారు. గ్రాఫిక్స్ చేసే సమయంలో గ్రీన్ కలర్ ఉన్న ప్రదేశాన్ని తొలగించి అక్కడ తమకు నచ్చిన ప్రదేశం లేదా ఇతర బ్యాక్‌గ్రౌండ్‌లను వాడుతారు. గ్రీన్ కలర్ మ్యాట్ వాడితేనే ఈ ప్రక్రియ అంతా సులభంగా జరుగుతుంది. అందుకనే ఈ కలర్ మ్యాట్‌లను గ్రాఫిక్స్ కోసం వాడుతారు.
ఇక షూటింగ్ చేసే సబ్జెక్ట్ ఏదైనా గ్రీన్ కలర్‌లో ఉంటే అప్పుడు బ్లూ కలర్ మ్యాట్‌ను ఉపయోగిస్తారు. ఇలా రెండు రకాల కలర్లకు చెందిన మ్యాట్‌లను గ్రాఫిక్స్ కోసం వాడుతారు.