మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. క్లీంకారకు జన్మనిచ్చిన ఉపాసన తమ బిడ్డను అపురూపంగా పెంచుకుంటున్నారు. అయితే పెళ్లయ్యాక 10 ఏళ్లకు వీరికి సంతానం కలిగింది. గతంలో వీరికి ఇంకా పిల్లలు ఎందుకు పుట్టడం లేదంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ ఉపాసన ఓ సందర్భంలో తాము పిల్లల కోసం ఎందుకు ఇంతకాలం ఆగామో అన్న విషయాన్ని వెల్లడించారు.
అందరూ కూడా మీరు తల్లిదండ్రులు ఎప్పుడు కాబోతున్నారు అని ఎదురుచూస్తున్నారు అనే ప్రశ్నకు ఉపాసన గతంలోనే స్పందించారు. అది మా జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ పిల్లలు పెంపకం అనేది ఒక 20 ఏళ్ల ప్రాజెక్టు లాంటిది. ఒక విధంగా అది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా 20 ఏళ్లు అనేది చాలా ముఖ్యం. వారితో చాలా క్లోజ్ గా వెళుతూ ఉండాలి, అని ఉపాసన అన్నారు. పిల్లల జీవితాలకు పేరెంట్స్ తప్పనిసరిగా 20 ఏళ్ల జీవితం అంకితం ఇవ్వాల్సి ఉంటుందని ఉపాసన పేర్కొన్నారు.
వాళ్లకు కావాల్సినవి సమకూర్చాలి. తప్పకుండా మేము వాటిని పుట్టబోయే పిల్లలకు అందించాలి అనే ఆలోచనతోనే ఉన్నాము. దాని కోసం కొంత నాలెడ్జ్ కూడా అవసరం. ఎంతో జాగ్రత్తగా పిల్లలను పెంచాలి. ఆ శుభతోరణం కోసం మానసికంగా, శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఉపాసన తెలిపారు. అలాగే పిల్లలను కనేందుకు మెంటల్ కాను, ఫిజికల్ గాను కూడా రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక 20 ఏళ్ల ఛాలెంజ్. ఎందుకంటే మళ్లీ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత 20 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎలా పెంచాను అనేది కూడా మీకు తెలియాలి. అది కూడా చాలా ముఖ్యమని ఉపాసన ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే పక్కా ప్లానింగ్ కోసమే వారు అన్నేళ్ల పాటు పిల్లల కోసం వేచి ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.