వినోదం

సాయిపల్లవి ఎందుకు అంత విజయవంతం అవుతోంది..? ఆమె స‌క్సెస్‌కు కార‌ణం ఏంటి..?

ఒక 30 ఏళ్ళ కిందట .. అప్పుల అప్పారావు అని అనే సినిమాలో అన్నపూర్ణ చిరంజీవికి వీరాభిమాని .. అందులో చిరు అంటే ఆవిడకు మితి మీరిన అభిమానం.. ఎంతగా అంటే చిరు మీద అభిమానం చూసి మొగుడి కూడా వదిలేస్తాడు ఆమెను .. హీరో వర్షిప్ ఆ రేంజ్ లో ఉండేది .. అలంటి వారు నిజ జీవితంలో చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళను నిజంగానే అందుకోలేని తార‌లుగా చూశారు ఆ రోజుల్లో. ఒక 15 ఇయర్స్ కిందటి దాకా సినీ హీరో హీరోయిన్లు అంటే .. చాలా అందమైన వారు, తెలివైన వారు, కళాకారులు. అద్భుతమైన మాట గాళ్ళు, ధనవంతులు అన్న ఫీలింగ్ ఉండేది .. కానీ వారికీ విలువలు తక్కువ అన్న భావన గట్టిగా జనాల్లో ఉండేది … సినిమా హీరో హీరోయిన్ అవ్వాలి అంటే .. ఎక్కడ నుండో ఊడి పడాలి కానీ .. average గా ఉన్న వారు అవ్వలేరు అన్న భావం ఉండేది ..

కానీ ఈ రోజుల్లో ఆ భావన తగ్గింది .. సినీ నటులు మన లాగే సామాన్యులు .. వారికీ విలువ ఉంటాయి అన్న భావన చిన్నగా జనాలు నమ్ముతున్నారు .. కానీ నటులు అవ్వడం అంత తేలిక కాదు అన్న భావన మాత్రం ఇంకా అలాగే ఉంది. మొహం నిండా మొటిమలు, పెద్ద పొడగరి కాదు, మాట, గొంతు మధురంగా ఉండదు, ఎక్స్‌పోజింగ్ కి విరుద్దం, బాష‌ రాదూ, పెద్ద పొడుగు జడ లేదు …జస్ట్ ఒక average అమ్మాయి .. ఇలాంటి నటిని తీసుకోడానికి మన దర్శకులు కచ్చితంగా జంకుతారు .. కానీ average గా ఉండడమే ఒక అమ్మాయికి పెద్ద asset గా మారతాయని ఎవరు ఊహించి ఉండరు .. అల్ఫోన్సే పుత్రేన్ ఏ కళ్ళతో చూశాడో .. అవే కళ్ళతో అందరికి సాయి పల్లవిని ప్రేమమ్ లో చూపించాడు .. తను మన లాగే సామాన్యురాలు , మన పక్కింటికి అమ్మాయి లాంటిదే అన్న భావన కలిగించడంలో అల్ఫోన్సేస్ విజయవంతం అయ్యాడు .. తన చేతే డ‌బ్బింగ్ కూడా చెప్పించాడు.

why sai pallavi is becoming more successful

ఒక D డాన్స్ షో చూసిన వారికీ తప్ప చాలామందికి తెలియని నిజం ఏంటి అంటే సాయి పల్లవి చాలా ఏళ్ళ కిందట తెలుగు షోస్ లో పాల్గొని తన ప్రతిభను చూపింది. తాను జార్జియా దేశంలో డాక్టర్ చదువు చదువుతూ ఉండగా .. డాన్స్ చేసిన ఒక వీడియోలో కూడా తన ప్రతిభ ఏంటో చూపింది. ముందు ఏవో ఒకటి అరా చిన్న పాత్రల్లో కనిపించిన .. మళయాలం ప్రేమమ్ లో తాను మొదటి సారి తెరకు పరిచయం అయింది … ఎప్పుడైతే ప్రతిభకు అవకాశం దొరుకుతుందో ఇంకా … అలంటి వాళ్ళను ఆపేది ఏమి ఉంటుంది ??? త‌న తడాకా చూపించింది … చింపి ఆరేసింది… సౌత్ ఇండియన్ దర్శకుల కళ్ళలో పడింది .. శేఖర్ కమ్మముల ఏమాత్రం ఆలస్యం చేయకుండా .. సాయి పల్లవి ని హీరోయిన్ గా పెట్టుకున్నాడు .. ఫిదాలో .. ఆ…. శేఖర్ కమ్ముల హిట్ కొట్టి ఒక దశాబ్దం అయింది కదా .. ఇంకా ఎవడు చూస్తాడు లే సినిమా అనుకున్నారు…

కానీ అప్పడి దాక మన తెలుగు సినిమా లో తెలంగాణ మాండలికం కేవలం రౌడీలకు, లేదా కామెడీ కోసం మాత్రమే వాడారు ఎక్కువ భాగం.. కానీ ఒక బాన్సువాడ అనే ఊరిలో ఒక మాములు ఆడపిల్ల life style ఎలా ఉంటుందో, ఎలా మాట్లాడుతుందో .. మనకు తెలిసేలా సాయి పల్లవి ఆ పాత్ర లో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసింది .. అందరు చూపు తిప్పుకోలేకుండా ఆ సినిమా చూసారు .. హీరో characterization చాలా బ్యాడ్ గా ఉంది .. అత‌డికి ఒక వ్యక్తిత్వం వుందా అని చాలా సార్లు అనిపించింది సినిమా చూస్తునంత సేపు .. కానీ సాయి పల్లవి మాత్రం తన నటన తో, శేఖర్ కథనంతో .. ఈ సినిమా చూసేలా చేసింది ..

అక్కడ నుంచి సాయి పల్లవి .. తన స్థాయిని మాత్రమే పెంచుకోలేదు .. తెలంగాణ accent కి కూడా ఒక విలువ పెంచింది .. అక్కడ నుంచి చాలా మంది హీరో లు ఆ మాండలికం వాడటం మొదలుపెట్టారు. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచెను మనసు, మారి 2, అథిరన్, NGK ఇవ్వన్నీ తన ఖాతాలో పడ్డాయి తన ప్రతిభను చూపాయి …ముఖ్యంగా .. NGK సినిమాలో ఓ సీన్ ఎంతో అద్భుతంగా చేసింది. కానీ ఇంత craze రావడానికి కేవలం ఒక్క సినిమా లో చూపించిన ప్రతిభ, తన అందచందాలేనా ?? అంటే కాదు. ఇందాక మనం అనుకున్నట్టు .. ఇప్పుడు మీడియా వలన సినిమా వారు కూడా మన లాగే సామాన్యులు అన్న భావన జనంలో కలిగింది .. ఒక నటుడు సామాన్యుడు అని తెలిసాక కూడా జనాలు వారిని ఇంకా అభిమానించడానికి ఇంకో విషయం కావాలి. అది ఎవరు ఇవ్వలేనిది వారికీ వారే పెంపొందించుకునేది .. అది ఏంటి అంటే వ్యక్తిత్వం .. అది అందరికి రాదు.

ఒక సారి సాయి పల్లవి ఎక్స్‌పోజింగ్ గురించి మాట్లాడుడు ” మీరు ఎక్సపోసింగ్ చేస్తారా అంటే కోటి రూపాయలు ఇచ్చిన కూడా చేయను .. ఎందుకంటే ఇంకో 20 ఏళ్ళ తరవాత కూడా నా సినిమాలు నా పిల్లలలు చూసి .. అమ్మ ఎంత బాగా చేసింది అనుకోవాలి కానీ .. వారు తల వంచుకోకూడదు అని కచ్చితంగా చెప్పింది .. గరికపాటి లాంటి ప్రవచనాలు చెప్పే వారు కూడా .. సాయి పల్లవి గురించి గొప్పగా చెప్పారు. అదే కాదు .. ఒక ఫెయిర్నెస్ cream కి advertisement చేయమని అడిగితే .. 2 కోట్లు ఇస్తాము అన్న కూడా నేను చేయను అని నిర్మొహమాటంగా చెప్పింది .. ఎక్కడ కూడా తన గురించి ..తాను ప్రేమలో ఉంది లేదా సినిమాల కోసం తన స్థాయిని తగ్గించుకుంది అన్న మాట మీడియాలో రాలేదు .. ఒక్క లైన్ లో చెప్పాలి అంటే.. Talent + Skill + Personality + Behavior + Luck = Sai Pallavi Success ఇలాంటి నటీమణులు ఎందరో ఇంకా రావాలని, తన లైఫ్ కుడా సారంగ దరియా అంత రంగుల మయంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Admin

Recent Posts